ఘనంగా ధారాలమ్మ జాతర ప్రారంభం
ABN , Publish Date - Mar 18 , 2026 | 12:39 AM
జీకేవీధి మండలం ధారకొండ ఘాట్‌రోడ్డులో కొలువైన గిరిజనుల ఆరాధ్య దైవం ధారాలమ్మ అమ్మవారి జాతర మంగళవారం ఘనంగా ప్రారంభ మైంది. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ ఈవో సాంబశివరావు, ఉత్సవ కమిటీ ప్రతినిధులు అన్ని ఏర్పాట్లు చేశారు. మూడు రోజుల పాటు జాతర జరగనుంది. తొలి రోజైన మంగళవారం ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం అన్నసమారాధన నిర్వహించారు.
- నేడు అమ్మవారి ప్రధాన పండుగ
సీలేరు, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): జీకేవీధి మండలం ధారకొండ ఘాట్‌రోడ్డులో కొలువైన గిరిజనుల ఆరాధ్య దైవం ధారాలమ్మ అమ్మవారి జాతర మంగళవారం ఘనంగా ప్రారంభ మైంది. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ ఈవో సాంబశివరావు, ఉత్సవ కమిటీ ప్రతినిధులు అన్ని ఏర్పాట్లు చేశారు. మూడు రోజుల పాటు జాతర జరగనుంది. తొలి రోజైన మంగళవారం ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం అన్నసమారాధన నిర్వహించారు. బుధవారం ప్రధాన పండుగ జరగనుంది. బుధవారం మఽధ్యాహ్నం వరకు భక్తులకు అమ్మవారి దర్శనం కల్పిస్తామని, మధ్యాహ్నం 3 గంటల తరువాత అమ్మవారికి మహా నివేదన సమర్పించి ఆలయ తలుపులు మూసి వేస్తామని ఉత్సవ కమిటీ ప్రతినిధులు తెలిపారు. తిరిగి గురువారం ఉదయం యఽథావిధిగా ఆలయం తలుపులు తెరిచి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పిస్తామన్నారు. జాతర జరిగే మూడు రోజులు ఆలయం వద్ద వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.