Share News

రెండేళ్లలో రూ.242 కోట్లతో అభివృద్ధి పనులు

ABN , Publish Date - Jun 07 , 2026 | 12:32 AM

గత రెండేళ్లలో మునిసిపాలిటీలో రూ.242 కోట్లతో 319 అభివృద్ధి పనులు చేపట్టామని స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. శనివారం 23వ వార్డు పాత బస్టాండ్‌లో టీడీపీ యూట్‌ ప్రెసిడెంట్‌ కటారి తాతబాబు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు.

రెండేళ్లలో రూ.242 కోట్లతో అభివృద్ధి పనులు
స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు దంపతులు ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణ చేస్తున్న దృశ్యం

- స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు

నర్సీపట్నం, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): గత రెండేళ్లలో మునిసిపాలిటీలో రూ.242 కోట్లతో 319 అభివృద్ధి పనులు చేపట్టామని స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. శనివారం 23వ వార్డు పాత బస్టాండ్‌లో టీడీపీ యూట్‌ ప్రెసిడెంట్‌ కటారి తాతబాబు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి రూ.185 కోట్లతో సమగ్ర తాగునీటి పథకాన్ని నిర్మిస్తున్నామన్నారు. స్థానిక ఏరియా ఆస్పత్రి అభివృద్ధికి రూ.2.63 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. రానున్న రోజుల్లో ప్రస్తుతం ఉన్న 28 వార్డులు 40 వార్డులకు పెంచుతున్నామని, దీని వలన ప్రతీ వార్డుపై దృష్టి పెట్టి మరింత అభివృద్ధి చేయడానికి వీలు పడుతుందన్నారు. తనకు రాజకీయ భవిషత్తును ఇచ్చిన నర్సీపట్నం ప్రజల రుణం తీర్చుకోవడానికి కృషి చేస్తానన్నారు. 23వ వార్డులో ఆరు పనులకు రూ.90 లక్షల నిధులు మంజూరు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్‌ చింతకాయల పద్మావతి, ఏఎంసీ చైర్మన్‌ రమణ, పార్టీ పట్టణ కార్యదర్శి లాలం మురళీకృష్ణ, నేరేళ్ల రాజేశ్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 07 , 2026 | 12:32 AM