అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి
ABN , Publish Date - Aug 12 , 2026 | 12:34 AM
జిల్లాలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అనకాపల్లి సీఎం సీఎం రమేశ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఢిల్లీ నుంచి వర్చువల్ విధానంలో అనకాపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో పలు శాఖల అధికారులతో సమావేశమయ్యారు.
అధికారులకు ఎంపీ రమేశ్ ఆదేశం
ఢిల్లీ నుంచి వర్చువల్‌గా సమావేశం
అనకాపల్లి, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అనకాపల్లి సీఎం సీఎం రమేశ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఢిల్లీ నుంచి వర్చువల్ విధానంలో అనకాపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో పలు శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనుల పురోగతి, పెండింగ్ అంశాలు, చేపట్టాల్సిన పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైల్వే, రెవెన్యూ, జీవీఎంసీ, విద్యుత్ శాఖల అధికారులతో వేర్వేరుగా మాట్లాడి, ఆయా శాఖల్లో పనుల ప్రగతిపై చర్చించి, దిశానిర్దేశం చేశారు. అనకాపల్లిలోనిఇ లక్ష్మీదేవిపేట వద్ద రెండు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రైల్వే ఫ్లై ఓవర్ వంతెన సమస్యపై అధికారులతో చర్చించారు.