Share News

రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి

ABN , Publish Date - Mar 18 , 2026 | 01:03 AM

రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి

రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి

17ఎన్‌పీ2:

20 నెలల్లో నర్సీపటాన్నికి రూ.21 కోట్లు తెచ్చాను

వచ్చే నెలలో మరో రూ.10 కోట్లు విడుదల

మునిసిపల్‌ కౌన్సిల్‌ చివరి సమావేశంలో స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు

నర్సీపట్నం, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): ‘పార్టీలు చూడను. నర్సీపట్నం అభివృద్ధి చేయాలన్నదే నా తపన. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకు మునిసిపాలిటీ అభివృద్ధికి రూ.21 కోట్లు మంజూరు చేయించాను. వచ్చే నెలలో మరో రూ.10 కోట్లు మంంజూరవుతాయి’ అని స్థానిక ఎమ్మెల్యే, శాసనసభ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. మంగళవారం నర్సీపట్నం పురపాలక సంఘం పాలక మండలి చివరి సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడుతూ, అభివృద్ధిలో మనకన్నా ఎంతో ముందున్న గుజరాత్‌ రాష్ట్రంలో సంక్షేమ పెన్షన్‌ రూ.400 మాత్రమే ఇస్తున్నారని, కానీ మన రాష్ట్రంలో దీనికి పది రెట్లు.. రూ.4 వేలు ఇస్తున్నామని అన్నారు. అసెంబ్లీ స్పీకర్‌గా వుండడంతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు కావాల్సిన నిధులను ఆయా శాఖల నుంచి సత్వరమే మంజూరు చేయించగలుగుతున్నానని, ఇందుకు మంత్రులందరూ సహకరిస్తున్నారని తెలిపారు. రానున్న మూడేళ్ల కాలంలో నర్సీపట్నం నియోజకవర్గం రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని చెప్పారు. ఎన్నికల సమయంలో రాజకీయాలు చేసుకోవాలని, మిగిలిన సమయంలో నియోజకవర్గం అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. పెద్ద చెరువులో 108 అడుగుల భారీ శివపార్వతుల విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నామని, దీంతో పర్యాటకంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుదని చెప్పారు. పురాతన బలిఘట్టం బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయాన్ని పరిశీలించడానికి కేంద్ర పురావస్తు శాఖ అధికారులను ఆహ్వానిస్తూ లేఖ రాశానని, త్వరలో వస్తామని లిఖిత పూర్వంగా తెలిపారని అన్నారు. ఈ ఆలయం రాతి కట్టడాలకు గతంలో వేసిన రంగులు తొలగించి, శిల్పకళాసంపద స్పష్టంగా కనిపించేలా పనులు చేయించడానికి కృషి చేస్తానని అన్నారు. అనంతరం చైర్‌పర్సన్‌, కౌన్సిలర్లును సన్మానించి జ్ఞాపికలు అందజేశారు.

Updated Date - Mar 18 , 2026 | 01:04 AM