జడ్పీటీసీ స్థానాల్లో విజేతల ఓట్ల వివరాలు..
ABN , Publish Date - Nov 08 , 2026 | 01:51 AM
జడ్పీటీసీ స్థానాల్లో విజేతల ఓట్ల వివరాలు..
(ఆంధ్రజ్యోతి- న్యూస్‌నెట్‌వర్క్)
అనకాపల్లి జడ్పీటీసీ స్థానంలో కూటమి అభ్యర్థి 16,261 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పల్లెల నాగేశ్వరరావుకు 57,337 ఓట్లు పోలవ్వగా, వైసీపీ అభ్యర్థి పల్లెల వెంకట సీతమ్మదొరకు 19,097 ఓట్లు వచ్చాయి.
కశింకోట జడ్పీటీసీ స్థానంలో కూటమి అభ్యర్థి 7,177 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. బీజేపీ నుంచి పోటీ చేసిన పొన్నగంటి నాగమణికి 23,784 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి బొడ్డేడ లక్ష్మికి 16,607 ఓట్లు వచ్చాయి.
సబ్బవరం జడ్పీటీసీ స్థానం నుంచి కూటమి అభ్యర్థి 3,080 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. జనసేన తరపున పోటీ చేసిన మామిడి అరుణకు 22,945 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి కర్రి లక్ష్మికి 19,865 ఓట్లు వచ్చాయి.
పరవాడలో కూటమి అభ్యర్థి 3,555 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. జనసేన తరపున పోటీ చేసిన మోటూరు నాగమణికి 17,916 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి బంధం దేవిలక్ష్మికి 14,361 ఓట్లు వచ్చాయి.
చోడవరం నుంచి కూటమి అభ్యర్థి 8,674 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. టీడీపీ అభ్యర్థి కనిశెట్టి సన్యాసిరావుకు 29,548 ఓట్లు పోలవ్వగా, వైసీపీ అభ్యర్థి దొడ్డి వెంకటరావుకు 20,874 ఓట్లు పడ్డాయి.
బుచ్చెయ్యపేటలో కూటమి అభ్యర్థి 4,437 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. జనసేన తరపున పోటీ చేసిన పోతల భవానికి 21,124 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి నమ్మి జోగా వరలక్ష్మికి 16,687 ఓట్లు పోలయ్యాయి.
రోలుగుంట నుంచి కూటమి అభ్యర్థి 4,921 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి సుర్ల సత్యంనాయుడుకు 17232 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి యర్రంశెట్టి శ్రీనివాసరావుకు 12,311 ఓట్లు వచ్చాయి.
రావికమతం జ.డ్పీటీసీ నుంచి కూటమి అభ్యర్థి 2,431 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. టీడీపీ తరపున పోటీ చేసిన కోట నీలవేణికి 21,885 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి పైల సన్యాసమ్మకు 19,454 ఓట్లు వచ్చాయి.
మాడుగుల నుంచి కూటమి అభ్యర్థి 7,177 ఓట్ల మెజారిటీతో గెలిచారు. టీడీపీ నుంచి పోటీ చేసిన పుప్పాల లక్ష్మీనారాయణకు 23,058 ఓట్లు పోలవ్వగా, వైసీపీ అభ్యర్థి తాళ్లపురెడ్డి వెంకట రాజారాంకు 15,881 ఓట్లు వచ్చాయి.
దేవరాపల్లిలో కూటమి అభ్యర్థి 3,504 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. టీడీపీ అభ్యర్థి కిలపర్తి రాజేశ్వరికి 20,111 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి వేచలపు వెంకట వాణికి 16,607 ఓట్లు మాత్రమే వచ్చాయి.
చీడికాడ నుంచి కూటమి అభ్యర్థి 4,116 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన కురచా రమేశ్‌కు 16,081 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి బలిజ నాయుడుకి 11,965 ఓట్లు వచ్చాయి.
కె.కోటపాడులో కూటమి అభ్యర్థి 3,641 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. టీడీపీ తరపున పోటీ చేసిన రొంగలి మహేశ్వరరావుకు 20,957 ఓట్లు పోలవ్వగా, వైసీపీ అభ్యర్థి రెడ్డి జగన్మోహన్కు 17,316 ఓట్లు వచ్చాయి.
నర్సీపట్నం జడ్పీటీసీ స్థానాన్ని1,105 ఓట్ల మెజారిటీతో కూటమి కైవసం చేసుకుంది. టీడీపీ అభ్యర్థిని సుకల రమణమ్మకు 9,624 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి బోళెం వెంకటేశ్‌కు 8,519 ఓట్లు వచ్చాయి.
గొలుగొండ జడ్పీటీసీ స్థానం నుంచి కూటమి అభ్యర్థి 5,498 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి గోరా చంద్రశేఖర్‌కు 17,817 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి మాదల ప్రవీణ్‌కుమార్‌కు 12,299 ఓట్లు వచ్చాయి.
మాకవరపాలెం నుంచి కూటమి అభ్యర్థి 5,701 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అల్లు రాయునాయుడుకు 16,796 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి రుత్తల రాజబాబుకు 12,342 ఓట్లు వచ్చాయి.
నాతవరం నుంచి కూటమి అభ్యర్థి 1,768 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. టీడీపీ తరపున పోటీ చేసిన జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ లెక్కల సన్యాసినాయుడుకు 20,091 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి డాక్టర్ అంకంరెడ్డి సౌమ్యకు 18,323 ఓట్లు వచ్చాయి.
పాయకరావుపేట జడ్పీటీసీ నుంచి కూటమి అభ్యర్థి 2,396 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి శ్రీరంగం భ్రమరేశ్వరికి 25471 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి చిక్కాల పద్మరాజేశ్వరికి 23,075 ఓట్లు వచ్చాయి.
కోటవురట్ల నుంచి కూటమి అభ్యర్థి 3,839 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. టీడీపీ అభ్యర్థి పురం నాగవేణికి 18,685 ఓట్లు పోలవ్వగా, వైసీపీ అభ్యర్ధి పెన్నాడ చిన్నారికి 14,746 ఓట్లు వచ్చాయి.
నక్కపల్లి జడ్పీటీసీ స్థానం నుంచి కూటమి అభ్యర్థి 2,312 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. టీడీపీ నుంచి పోటీ చేసిన గంట్యాడ రమేశ్ 25,523 ఓట్లు పోలవ్వగా, వైసీపీ అభ్యర్థి కాకర వెంకటరావుకు 23,211 ఓట్లు వచ్చాయి.
ఎస్.రాయవరం జడ్పీటీసీ నుంచి కూటమి అభ్యర్థి 13,221 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. టీడీపీ తరపున పోటీ చేసిన అమలకంటి రమణకుకు 27,091 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి పెనపాల పద్మావతికి 13,870 ఓట్లు మాత్రమే వచ్చాయి.
ఎలమంచిలి జడ్పీటీసీ నుంచి కూటమి అభ్యర్థి 2,367 ఓట్ల మెజారీటీతో విజయం సాధించారు. జనసేన అభ్యర్థి రావి చలపతికి 8,666 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థి రాజాన శ్రీనివాసరావుకు 6,299 ఓట్లు వచ్చాయి.
మునగపాక నుంచి కూటమి అభ్యర్థి 2,009 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. టీడీపీ నుంచి పోటీ చేసిన పెంటకోట స్వాతికి 18,511 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థి ఆడారి కమలప్రియకు 16,502 ఓట్లు లభించాయి.
అచ్యుతాపురం నుంచి కూటమి అభ్యర్థి 7,302 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన పీలా హైమావతికి 26,278 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థి నరమాల సుహాసినికి 18.976 ఓట్లు వచ్చాయి.
రాంబిల్లి నుంచి కూటమి అభ్యర్థి 1,111 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. జనసేన అభ్యర్థి సేనాపతి రత్నంకు 16,415 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి నీరుకొండ శారదకు 15,304 ఓట్లు వచ్చాయి.