Share News

14న డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ రాక!

ABN , Publish Date - Mar 11 , 2026 | 11:44 PM

డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ఈ నెల 14న జిల్లాకు రానున్నారు. అడవితల్లి బాటలో భాగంగా పాడేరు మండలం వంట్లమామిడి పంచాయతీ నందిగరువు గ్రామానికి నిర్మించిన రోడ్డును ఆయన పరిశీలిస్తారు.

14న డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ రాక!

పాడేరు మండలం నందిగరువు గ్రామంలో రోడ్డు సందర్శన, గిరిజనులతో ముఖాముఖి

పాడేరు, మార్చి 11(ఆంధ్రజ్యోతి): డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ఈ నెల 14న జిల్లాకు రానున్నారు. అడవితల్లి బాటలో భాగంగా పాడేరు మండలం వంట్లమామిడి పంచాయతీ నందిగరువు గ్రామానికి నిర్మించిన రోడ్డును ఆయన పరిశీలిస్తారు. అనంతరం నందిగరువు గ్రామంలోని గిరిజనులతో ఆయన ముచ్చటిస్తారు. అయితే డిప్యూటీ సీఎం పర్యటనపై అధికారికంగా ప్రకటించలేదు. కానీ జనసేన అరకులోయ పార్లమెంట్‌ కన్వీనర్‌ డాక్టర్‌ వంపూరు గంగులయ్య బుధవారం జిల్లా కేంద్రంలో పార్టీ శ్రేణులతో సమావేశమై పవన్‌కల్యాణ్‌ పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. డిప్యూటీ సీఎం కార్యక్రమాన్ని అధికారికంగా ప్రకటించనప్పటికీ ఆయన రాకపై మాత్రం అధికారులు పలు ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated Date - Mar 11 , 2026 | 11:46 PM