Share News

నేడు ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ రాక

ABN , Publish Date - Apr 08 , 2026 | 12:43 AM

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్‌ కల్యాణ్‌ బుధవారం నగరానికి రానున్నారు.

నేడు ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ రాక

ఏయూ మెగా కల్చరల్‌ ఫెస్ట్‌-2026

ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి):

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్‌ కల్యాణ్‌ బుధవారం నగరానికి రానున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న మెగా కల్చరల్‌ ఫెస్ట్‌ ముగింపు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఆయన గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఐదు గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్లి శతాబ్ది మహోత్సవ్‌-ఏయూ మెగా కల్చరల్‌ ఫెస్ట్‌-2026 వేడుకల్లో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం విమానాశ్రయానికి చేరుకుని తిరిగి విజయవాడ వెళతారు. ఉప ముఖ్యమంత్రి పర్యటనకు జిల్లా యంత్రాంగం, పోలీస్‌ శాఖ ఏర్పాట్లు పూర్తిచేశాయి.

Updated Date - Apr 08 , 2026 | 12:43 AM