Share News

అడుగంటిన భూగర్భ జలాలు

ABN , Publish Date - Sep 20 , 2026 | 01:00 AM

జిల్లాలో భూగర్భ జలాలు రోజు రోజుకు అడుగంటుతున్నాయి. గత ఏడాది ఈ నెలతో పోలిస్తే ప్రస్తుత భూగర్భ జలమట్టం గణనీయంగా దిగజారింది. గత ఏడాది సెప్టెంబరు నెలలో జిల్లాలో సగటు భూగర్భ జలాలు భూమట్టానికి 4.04 మీటర్ల లోతులో ఉండగా, ఈ ఏడాది ఈ నెల 19వ తేదీ నాటికి 7.71 మీటర్లకు చేరింది. అంటే ఏడాదిలో సగటున 3.67 మీటర్ల మేర భూగర్భ జలమట్టం పడిపోయింది. జిల్లా భూగర్భ జల వనరుల శాఖ అధకారులు తాజాగా శనివారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం భూగర్భ జలాలు గత ఏడాదితో పోలిస్తే భారీగా దిగజారిపోయినట్లు స్పష్టమవుతోంది.

అడుగంటిన భూగర్భ జలాలు
రోలుగుంట మండలం ఎం.కొత్తపట్నంలో పైజో మీటరు ద్వారా భూగర్భ జలమట్టాన్ని కొలుస్తున్న అధికారి

- గత ఏడాదితో పోలిస్తే భారీగా తగ్గుదల

- ఏడాదిలో సగటున 3.67 మీటర్ల మేర తగ్గిపోయిన వైనం

- అత్యధికంగా అచ్యుతాపురంలో 11.70 మీటర్లు

(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)

జిల్లాలో భూగర్భ జలాలు రోజు రోజుకు అడుగంటుతున్నాయి. గత ఏడాది ఈ నెలతో పోలిస్తే ప్రస్తుత భూగర్భ జలమట్టం గణనీయంగా దిగజారింది. గత ఏడాది సెప్టెంబరు నెలలో జిల్లాలో సగటు భూగర్భ జలాలు భూమట్టానికి 4.04 మీటర్ల లోతులో ఉండగా, ఈ ఏడాది ఈ నెల 19వ తేదీ నాటికి 7.71 మీటర్లకు చేరింది. అంటే ఏడాదిలో సగటున 3.67 మీటర్ల మేర భూగర్భ జలమట్టం పడిపోయింది. జిల్లా భూగర్భ జల వనరుల శాఖ అధకారులు తాజాగా శనివారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం భూగర్భ జలాలు గత ఏడాదితో పోలిస్తే భారీగా దిగజారిపోయినట్లు స్పష్టమవుతోంది.

జిల్లాలో మండలాల వారీగా పరిశీలిస్తే అచ్యుతాపురంలో అత్యధికంగా 11.70 మీటర్ల మేర భూగర్భ జల మట్టం తగ్గింది. గత ఏడాది సెప్టెంబరు నెలలో 17.16 మీటర్లుగా ఉన్న జలమట్టం ప్రస్తుతం 28.86 మీటర్ల లోతుకు పడిపోయింది. ఆ తరువాత ఎస్‌.రాయవరం మండలంలో 6.37 మీటర్లు, రావికమతంలో 5.53 మీటర్లు, మునగపాకలో 5.53 మీటర్లు, చోడవరంలో 5.17 మీటర్ల మేర తగ్గుదల నమోదైంది.

తీవ్ర వర్షాభావం... పెరుగుతున్న నీటి వినియోగం

ఖరీఫ్‌ సీజన్‌లో ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడం, సాగునీటి అవసరాల కోసం భూగర్భ జలాలపై ఆధారపడడం, తదితర కారణాలతో జలమట్టాలు తగ్గుతున్నాయి. ముఖ్యంగా వర్షపాతం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో బోర్ల ద్వారా నీటి వినియోగం పెరగడంతో పరిస్థితి మరింత తీవ్రతరం అవుతోంది. ప్రస్తుత గణాంకాల్లో దాదాపు అన్ని మండలాల్లో గత ఏడాదితో పోలిస్తే భూగర్భ జలమట్టాలు దిగజారడం గమనార్హం. భూగర్భ జలాలు ఇదే విధంగా తగ్గుతూ పోతే వ్యవసాయ బోర్లపై మరింత ఒత్తిడి పడే అవకాశం ఉంది. వర్షాలు కురిసినప్పుడు భూగర్భ జలాల రీచార్జీకి అవకాశం కల్పించే చర్యలు, చెక్‌డ్యామ్‌లు, నీటి సంరక్షణ నిర్మాణాల వినియోగం, వర్షపు నీటిని భూమిలోకి ఇంకించే చర్యలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని భూగర్భ జలవనరుల శాఖ హైడ్రాలజిస్ట్‌ బి.సత్యనారాయణమూర్తి తెలిపారు.

జిల్లాలోని మండలాల్లో గత ఏడాది సెప్టెంబరులో, ఈ ఏడాది సెప్టెంబరు 19 వరకు పోలిస్తే నీటి మట్టాల తగ్గుదల ఇలా....

----------------------------------------------------------------

మండలం 2025 2026 తగ్గుదల(మీటర్లలో..)

---------------------------------------------------------------

అనకాపల్లి 3.74 6.38 2.64

అచ్యుతాపురం 17.16 28.86 11.70

బుచ్చెయ్యపేట 6.74 11.72 4.98

చీడికాడ 1.35 4.30 2.95

చోడవరం 1.95 7.12 5.17

దేవరాపల్లి 8.48 12.05 3.57

గొలుగొండ 6.87 10.47 3.60

కె.కోటపాడు 1.65 5.52 3.87

కశింకోట 1.56 4.42 2.86

కోటవురట్ల 3.76 6.34 2.58

మాడుగుల 5.08 7.86 2.78

మాకవరపాలెం 1.47 4.97 3.50

మునగపాక 2.53 8.06 5.53

నక్కపల్లి 4.77 6.98 2.21

నర్సీపట్నం 0.43 3.15 2.72

నాతవరం 2.09 5.18 3.09

పరవాడ 5.55 9.13 3.58

పాయకరావుపేట 5.76 7.44 1.68

రాంబిల్లి 4.63 6.45 1.82

రావికమతం 3.39 8.92 5.53

రోలుగుంట 2.81 6.68 3.87

ఎస్‌.రాయవరం 3.01 9.38 6.37

సబ్బవరం 2.81 6.68 3.87

ఎలమంచిలి 3.90 6.15 2.25

---------------------------------------------------------------

జిల్లా సగటు 4.04 7.71 3.67

--------------------------------------------------------------

Updated Date - Sep 20 , 2026 | 01:00 AM