Share News

టీచర్‌గా డీఈవో

ABN , Publish Date - Aug 28 , 2026 | 11:37 PM

మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను జిల్లా విద్యాశాఖ అధికారి భానుమూర్తిరాజు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత తురకలవలస బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించిన డీఈవో పదో తరగతి విద్యార్థులతో మమేకమయ్యారు. ముఖ్యంగా సోషల్‌ స్టడీస్‌ సబ్జెక్టులో మ్యాప్‌ పాయింటింగ్‌పై విద్యార్థులకు స్వయంగా బోధించారు.

టీచర్‌గా డీఈవో
విద్యార్థులకు మ్యాప్‌ పాయింటింగ్‌ను వివరిస్తున్న డీఈవో భానుమూర్తి రాజు

విద్యార్థులకు మ్యాప్‌ పాయింటింగ్‌ను వివరించిన డీఈవో భానుమూర్తి రాజు

పెదబయలు, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను జిల్లా విద్యాశాఖ అధికారి భానుమూర్తిరాజు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత తురకలవలస బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించిన డీఈవో పదో తరగతి విద్యార్థులతో మమేకమయ్యారు. విద్యార్థులను వివిధ అంశాలపై ప్రశ్నలు అడిగి, వారి అవగాహన స్థాయిని తెలుసుకున్నారు. ముఖ్యంగా సోషల్‌ స్టడీస్‌ సబ్జెక్టులో మ్యాప్‌ పాయింటింగ్‌పై విద్యార్థులకు స్వయంగా బోధించారు. అనంతరం విద్యార్థుల సమాధానాలకు సంతృప్త వ్యక్తం చేస్తూ.. మరింత శ్రద్ధతో చదివి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించిన డీఈఓ పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రతి విద్యార్థి ప్రగతిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక బోధన అందించాలన్నారు. రానున్న పదో తరగతి పరీక్షల్లో శతశాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం గంపరాయి మోడల్‌ ప్రైమరీ పాఠశాలను తనిఖీ చేశారు. పాఠశాల నిర్వహణ, విద్యార్థుల హాజరు, బోధనా విధానాలను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతోపాటు వారి అభ్యాసన సామార్థ్యాలను పెంపొందించేందుకు ఉపాధ్యాయులు నిరంతరం కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవోలు కృష్ణమూర్తి, పుష్ప జోసెఫ్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Aug 28 , 2026 | 11:37 PM