Share News

దట్టంగా పొగమంచు

ABN , Publish Date - Mar 14 , 2026 | 11:43 PM

మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండడంతోపాటు పొగమంచు తీవ్రత కొనసాగుతున్నది.

 దట్టంగా పొగమంచు
పాడేరు మెయిన్‌రోడ్డులో శనివారం ఉదయం కమ్మేసిన పొగమంచు

పెరుగుతున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు

అరకులోయలో 15.2 డిగ్రీలు

పాడేరు, మార్చి 14(ఆంధ్రజ్యోతి): మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండడంతోపాటు పొగమంచు తీవ్రత కొనసాగుతున్నది. జిల్లా కేంద్రం పాడేరుతో సహా అనేక మండలాల్లో శనివారం ఉదయం పొగమంచు కురిసింది. దీంతో వాహనాలు సైతం లైట్లు వేసుకుని రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత కొన్ని రోజులుగా వాతావరణంలోని మార్పులతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నప్పటికీ చలి, పొగమంచు ప్రభావం కొనసాగుతుండడం విశేషం. శనివారం అరకులోయలో 15.2 డిగ్రీల సెల్సియస్‌ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా ముంచంగిపుట్టులో 16.4, పెదబయలులో 17.3, చింతపల్లిలో 19.4, కొయ్యూరులో 20.0, జి.మాడుగులలో 20.1, కొయ్యూరులో 22.1 డిగ్రీల సెల్సియస్‌ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదయ్యాయి.

Updated Date - Mar 14 , 2026 | 11:43 PM