Share News

దట్టంగా పొగమంచు

ABN , Publish Date - Feb 03 , 2026 | 11:35 PM

మన్యంలో దట్టంగా పొగమంచు కురుస్తోంది. రోజూ ఉదయం 10 గంటల వరకు మంచు తెరలు వీడడం లేదు.

దట్టంగా పొగమంచు
పాడేరు- విశాఖపట్నం మెయిన్‌రోడ్డులో మంగళవారం ఉదయం కమ్మేసిన పొగమంచు

తగ్గని చలి ప్రభావం

అరకులోయలో 10.8 డిగ్రీలు

పాడేరు, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): మన్యంలో దట్టంగా పొగమంచు కురుస్తోంది. రోజూ ఉదయం 10 గంటల వరకు మంచు తెరలు వీడడం లేదు. పాడేరులో మంగళవారం ఉదయం 10 గంటల వరకు ఎదుట వ్యక్తులు కనిపించని విధంగా మంచు కురిసింది. దీంతో వాహనాలు లైట్లు వేసుకుని రాకపోకలు సాగించాయి.

అరకులోయలో 10.8 డిగ్రీలు

మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతున్నాయి. మంగళవారం అరకులోయలో 10.8, జి.మాడుగులలో 11.1, ముంచంగిపుట్టులో 12.4, హుకుంపేటలో 12.9, చింతపల్లిలో 13.3, పెదబయలులో 13.9, కొయ్యూరులో 14.7, అనంతగిరిలో 16.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

అరకులోయలో..

అరకులోయ: మండలంలో పొగమంచు దట్టంగా కురిసింది. మంగళవారం వేకువ జాము నుంచి ఉదయం 10 గంటల వరకు మంచు తెరలు వీడలేదు. వాహనాలు లైట్ల వెలుతురులో రాకపోకలు సాగించాయి. పొగమంచు వల్ల ఉద్యోగులు, విద్యార్థులు, రైతులు ఉదయాన్నే బయటకు వెళ్లడానికి ఇబ్బంది పడ్డారు. అయితే పర్యాటకులు మాత్రం మంచు అందాలను ఆస్వాదించారు.

Updated Date - Feb 03 , 2026 | 11:35 PM