Share News

జాతీయ స్థాయి రెజ్లింగ్‌ పోటీలకు డిగ్రీ కళాశాల విద్యార్థుల ఎంపిక

ABN , Publish Date - Jan 04 , 2026 | 11:35 PM

జాతీయ స్థాయి రెజ్లింగ్‌ పోటీలకు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎం.విజయభారతి తెలిపారు.

జాతీయ స్థాయి రెజ్లింగ్‌ పోటీలకు డిగ్రీ కళాశాల విద్యార్థుల ఎంపిక
జాతీయ స్థాయి రెజ్లింగ్‌ పోటీలకు ఎంపికైన డిగ్రీ కళాశాల విద్యార్థులు

చింతపల్లి, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): జాతీయ స్థాయి రెజ్లింగ్‌ పోటీలకు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎం.విజయభారతి తెలిపారు. ఆదివారం ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడుతూ కళాశాలకు చెందిన తృతీయ సంవత్సరం బీఎస్సీ విద్యార్థి సీహెచ్‌ మహేశ్‌, ద్వితీయ సంవత్సరం బీఏ విద్యార్థి వి.మహేశ్‌, ప్రథమ సంవత్సరం బీఏ విద్యార్థి జె.జీవన్‌లు డివిజన్‌, రాష్ట్ర స్థాయి రెజ్లింగ్‌ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి గోల్డ్‌, సిల్వర్‌ మెడల్స్‌ సాధించారన్నారు. ఈ మేరకు ఈ నెల 5 నుంచి తొమ్మిదవ తేదీ వరకు మొహీలీ పంజాబ్‌ చండీఘర్‌ విశ్వవిద్యాలయంలో జరిగే జాతీయ రెజ్లింగ్‌ పోటీలకు వారు ఎంపికయ్యారని చెప్పారు. రెజ్లింగ్‌ శిక్షణ ఇస్తున్న పీడీ శివరామ్‌కుమార్‌ను ఈ సందర్భంగా అభినందించారు.

Updated Date - Jan 04 , 2026 | 11:35 PM