Share News

కొడవటిపూడిలో డిఫెన్స్‌ కార్యాలయం

ABN , Publish Date - Jan 10 , 2026 | 01:15 AM

మండలంలోని కొడవటిపూడి ప్రాంతంలో రక్షణ శాఖ కార్యాలయం ఏర్పాటుకు డీఆర్‌డీవో అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇందుకోసం సుమారు 1,000 ఎకరాలను సేకరించాలని నిర్ణయించారు. వీటిలో అసైన్డ్‌ భూములు ఎంత వున్నాయి? జిరాయితీ భూములు ఎంతమేర కొనుగోలు చేయాలన్న దానిపై శుక్రవారం డీఆర్‌డీఏ అధికారులు, తహశీల్దారు శ్రీనివాసరావుతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

కొడవటిపూడిలో డిఫెన్స్‌ కార్యాలయం
డిఫెన్స్‌ కార్యాలయం ఏర్పాటుకు అవసరమైన భూముల కోసం మ్యాప్‌ను పరిశీలిస్తున్న అధికారులు

వెయ్యి ఎకరాలు అవసరమని డీఆర్‌డీఏ అధికారులు వెల్లడి

డి.పట్టా భూములతోపాటు జిరాయితీ భూములు సేకరించాలని నిర్ణయం

తహశీల్దారుతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలన

కోటవురట్ల, జనవరి 9 (ఆంద్రజ్యోతి): మండలంలోని కొడవటిపూడి ప్రాంతంలో రక్షణ శాఖ కార్యాలయం ఏర్పాటుకు డీఆర్‌డీవో అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇందుకోసం సుమారు 1,000 ఎకరాలను సేకరించాలని నిర్ణయించారు. వీటిలో అసైన్డ్‌ భూములు ఎంత వున్నాయి? జిరాయితీ భూములు ఎంతమేర కొనుగోలు చేయాలన్న దానిపై శుక్రవారం డీఆర్‌డీఏ అధికారులు, తహశీల్దారు శ్రీనివాసరావుతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సుమారు 100 ఎకరాలు మాత్రమే ప్రభుత్వ, డి.పట్టా భూములు వున్నాయని, మిగతా భూములను రైతుల నుంచి సేకరించాలని నిర్ణయించారు. కాగా కొడవటిపూడి ప్రాంతంలో రక్షణ శాఖ కార్యాలయం ఏర్పాటు కానున్నందున లింగాపురం జంక్షన్‌ నుంచి కొడవటిపూడి వరకు 12 కిలోమీటర్ల మేర 40 అడుగుల వెడ్పున రోడ్డు నిర్మించాలని, ఇందుకు అవసరమైన భూమిని కూడా సేకరించాలని డీఆర్‌డీఓ అధికారులు కోరారు. అయితే లింగాపురం, తిమ్మాపురం, కె.వెంకటాపురం గ్రామాల వద్ద బైపాస్‌ రోడ్లు నిర్మించాల్సి వుంటుందని అధికారులు అభిప్రాయపడ్డారు.

Updated Date - Jan 10 , 2026 | 01:16 AM