కొలంబో డాక్‌యార్డుతో డీసీఐ ఒప్పందం
ABN , Publish Date - Apr 08 , 2026 | 12:39 AM
కొలంబో డాక్‌యార్డ్ పీఎల్‌సీతో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ) మంగళవారం కీలక ఒప్పందం చేసుకుంది.
విశాఖపట్నం, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి):
కొలంబో డాక్‌యార్డ్ పీఎల్‌సీతో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ) మంగళవారం కీలక ఒప్పందం చేసుకుంది. ఇండియా, శ్రీలంక మధ్య ప్రాంతీయ సహకారంలో భాగంగా కొలంబో డాక్‌యార్డ్‌తో డీసీఐ కలిసి పనిచేస్తుంది. నౌకల నిర్వహణ, మరమ్మతులు, రెట్రో ఫిటింగ్, కొత్త నౌకల నిర్మాణంలో అధిక నాణ్యత, తక్కువ ఖర్చులో పనిచేయడమే ఈ ఒప్పందం లక్ష్యమని డీసీఐ ఎండీ, ఈసీఓ కెప్టెన్ దివాకర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. కొలంబోలో జరిగిన ఈ ఎంఓయూ కార్యక్రమంలో భారత హైకమిషనర్ సంతోష్ ఝా, మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ సీఎండీ కెప్టెన్ జగన్మోహన్, షిప్ బిల్డింగ్ డైరెక్టర్ బిజు జార్జ్, భారత హైకమిషనర్ కౌన్సిలర్ దేవికా లాల్ తదితరులు పాల్గొన్నారు.