Share News

ఙరైళ్లకు దసరా రద్దీ

ABN , Publish Date - Oct 09 , 2026 | 12:40 AM

రైళ్లకు దసరా రద్దీ నెలకొంది. హౌరా, బెంగళూరు, చెన్నై వెళ్లే రైళ్లకు తీవ్ర డిమాండ్‌ ఏర్పడింది.

ఙరైళ్లకు దసరా రద్దీ

  • బెంగళూరు, హౌరా రూట్లకు డిమాండ్‌

  • హౌరా రైళ్లకు నవంబరు 20 వరకు బెర్తులు ఫుల్‌

  • బెంగళూరు, చెన్నై రైళ్లకు అక్టోబరు నెలాఖరు వరకు

  • సికింద్రాబాద్‌ రైళ్లకు సాధారణ రద్దీ

విశాఖపట్నం, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి):

రైళ్లకు దసరా రద్దీ నెలకొంది. హౌరా, బెంగళూరు, చెన్నై వెళ్లే రైళ్లకు తీవ్ర డిమాండ్‌ ఏర్పడింది. హౌరా రైళ్లకు నవంబరు 20 వరకు బెర్తులు లభించని పరిస్థితి నెలకొంది. చెన్నై, బెంగళూరు రైళ్లకు తీవ్ర డిమాండ్‌ నెలకొంది విశాఖ మీదుగా చెన్నై వెళ్లే కోరమాండల్‌, మెయిల్‌తోపాటు బెంగళూరువెళ్లే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌, హౌరా-బెంగళూరు, భువనేశ్వర్‌-బెంగళూరు రైళ్లకు ఈ నెలాఖరు వరకు బెర్తులు నిండిపోయాయి. సికింద్రాబాద్‌ వెళ్లే రైళ్లకు సాధారణ రద్దీఉంది. గరీబ్‌రథ్‌, గోదావరి, మహబూబ్‌నగర్‌, నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్‌లకు సాధారణ రద్దీ కనిపిస్తోంది.

హౌరా రైళ్లకు నిరీక్షణ జాబితా

విశాఖ మీదుగా హౌరా వెళ్లే అన్ని రైళ్లకు నవంబరు 20 వరకు నిరీక్షణ జాబితా ఏర్పడింది. కోరమాండల్‌ (12842),యశ్వంత్‌పూర్‌-హౌరా (12864), ఈస్ట్‌కోస్ట్‌ (18046), మెయిల్‌ (12840), ఫలక్‌నుమా (12704), బెంగళూరు-హౌరా దురంతో (12246)లకు నిరీక్షణ నెలకొంది. షాలిమార్‌ (22641), మైసూరు-హౌరా (22818), వాస్కోడిగామ-షాలిమార్‌ (18048), గురుదేవ్‌ (12638), వివేక్‌ (22503), చెన్నై-సంత్రాగచ్చి (22808), పాండిచ్చేరి-హౌరా (12868), బెంగళూరు-గువాహటి (12509), చెన్నై సెంట్రల్‌-షాలిమార్‌ (22826), తిరుచిరాపల్లి-హౌరా (12664), కన్యాకుమారి-హౌరా (12666), తిరుపతి-హౌరా హంసఫర్‌ (29890), సికింద్రాబాద్‌-షాలిమార్‌ (22850), శ్రీసత్యసాయి ప్రశాంతి నిలయం-హౌరా (22832) వంటి వారాంతపు రైళ్లకు డిమాండ్‌ పెరిగింది.

బెంగళూరు రైళ్లకు డిమాండ్‌

విశాఖ మీదుగా బెంగుళూరు వెళ్లే రైళ్లకు అక్టోబరు నెలాఖరు వరకు బెర్తులు నిండి నిరీక్షణ జాబితా కనిపిస్తోంది. ముఖ్యంగా భువనేశ్వర్‌-బెంగళూరు ప్రశాంతి (18463), హౌరా-యశ్వంతపూర్‌ (12863) అన్ని క్లాసుల బెర్తులు నిండిపోయాయి. జసితిహ్‌ జంక్షన్‌-ఎస్‌ఎంవీటీ బెంగళూరు (22306), భువనేశ్వర్‌-బెంగళూ రు హంసఫర్‌ (22833), గువాహటి-బెంగళూరు (12510), భగల్‌పూర్‌-బెంగళూరు (12254), హటియా-బెంగళూరు (18637), భువనేశ్వర్‌-బెంగళూరు హంసఫర్‌ (22833), హౌరా-మైసూరు ఎక్స్‌ప్రెస్‌ (22817), న్యూటిన్సుకియా-బెంగళూరు (22502), కామాఖ్య-బెంగళూరు (12552), పూరి-బెంగళూరు గరీబ్‌రథ్‌ (22883), హౌరా-బెంగళూరు దురంతో (12245), అగర్తలా-బెంగళూరు హంసఫర్‌ (12504) రైళ్లకు డిమాండ్‌ ఏర్పడింది.

చెన్నై రైళ్లకూ అదే పరిస్థితి

చెన్నై మెయిల్‌ (12839), బొకారో ఎక్స్‌ప్రెస్‌ (13351), టాటా-ఎర్నాకులం (18189) రెగ్యులర్‌ రైళ్లకు నవంబరు 2 వరకు బెర్తులు లేవు. కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌కు (12841) కూడా అక్టోబరు 26 వరకు బెర్తులు లభించడం లేదు. అక్టోబరు 27 నుంచి స్లీపర్‌ క్లాసు లభిస్తున్నాయి. భువనేశ్వర్‌-పాండిచ్చేరి (12898), షాలిమార్‌-త్రివేండ్రం (22642), గువాహటి-బెంగళూరు (12510), హౌరా-తిరుచిరాపల్లి (12660), ముజఫర్‌పూర్‌-యశ్వంతపూర్‌ (15228),సంత్రాగచ్చి-చెన్నై ఏసీ ఎక్స్‌ప్రెస్‌ (22807), న్యూజలపాయ్‌గురి-మద్రాసు (22616) వంటి వీక్లీ, బై వీక్లీ రైళ్లకు డిమాండ్‌ ఏర్పడింది.

సికింద్రాబాద్‌ రైళ్లకు సాధారణం

సికింద్రాబాద్‌ వెళ్లే గోదావరి (12727), గరీబ్‌రథ్‌ (12739), కోణార్క్‌ (11020), ఫలక్‌నూమా (12703), వందేభారత్‌ (20833), విశాఖ-నాందేడ్‌ (20811), ఎల్‌టీటీ (18519), దురంతో (22203)రైళ్లకు సాధారణ రద్దీ ఉంది. గోదావరి, వందేభారత్‌ (20833, 20708), వారాంతపు రైళ్లకు కొన్ని తేదీల్లో బెర్తులున్నాయి.

దసరాకు ఆర్టీసీ 420 ప్రత్యేక బస్సులు

ద్వారకా బస్‌స్టేషన్‌, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): విజయదశమిని పురస్కరించుకుని శుక్రవారం నుంచి ఈ నెల 22వ తేదీ వరకు నగరం నుంచి వివిధ ప్రాంతాలకు 420 ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు ఆర్టీసీ విశాఖ రీజనల్‌ మేనేజర్‌ బి.అప్పలనాయుడు తెలిపారు. విశాఖ నుంచి విజయవాడ, రాజమహేంద్రవరం, హైదరాబాద్‌, అమలాపురం, టెక్కలి, పార్వతీపురం, పాలకొండ, పలాస, టెక్కలి, శ్రీకాకుళం, సాలూరు, విజయనగరం ప్రాంతాలకు బస్సులు నడుస్తాయని పేర్కొన్నారు.

Updated Date - Oct 09 , 2026 | 12:40 AM