సీలేరు కాంప్లెక్సులో డ్యాం సేప్టీ నిపుణుల తనిఖీ
ABN , Publish Date - Nov 13 , 2026 | 10:54 PM
సీలేరు కాంప్లెక్సు పరిధిలోని ఎగువ సీలేరులో శుక్రవారం డ్యాం సేప్టీ నిపుణుల బృందం పర్యటించింది.
గుంటవాడ జలాశయం, మొయిన్, రెగ్యులేటర్, ఎర్త్ డ్యాంల పరిశీలన
సీలేరు, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): సీలేరు కాంప్లెక్సు పరిధిలోని ఎగువ సీలేరులో శుక్రవారం డ్యాం సేప్టీ నిపుణుల బృందం పర్యటించింది. కేంద్ర కమిటీ ఆదేశాల మేరకు 60 సంవత్సరాలు పైబడిన సీలేరు కాంప్లెక్సు పరిధిలోని డ్యాంలు, పటిష్టత, వాటి స్థితిగతులపై నివేదికను అందించాలన్న ఆదేశాల మేరకు రాష్ట్ర డ్యాం సేప్టీ అఽథారిటీ చైర్మన్ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ సభ్యులు బి. చంద్రశేఖర్, ఈవీఎస్‌ఈ వరప్రసాద్ సీలేరులో గురు, శుక్రవారాల్లో పర్యటించి జలవిద్యుత్ కేంద్రానికి నీరందించే గుంటవాడ మెయిన్, రెగ్యులేటర్ డ్యాం, ప్రధాన ఆనకట్టలను పరిశీలించారు. ఈ సందర్భంగా సీలేరు గుంటవాడ మెయిన్, డ్యాం గేట్లు, గ్యాలరీ, ఎర్త్ డ్యాం, ఇతర సివిల్ స్ట్రక్చర్లను, జనరేటర్‌లను స్థానిక జెన్‌కో ఇంజనీర్లతో కలసి బృంద సభ్యులు పరిశీలించారు. డ్యాం గేట్లు స్థితిగతులు, ఎక్కడెక్కడ లీకేజీలు ఉన్యాయి.. తదితర అంశాలను ఈ బృందం క్షుణ్ణంగా పరిశీలన చేసి నివేదికను తయారు చేస్తారు. ఈ నివేదికను కేంద్ర కమిటీకి అందజేసిన తర్వాత డ్యాంల లైఫ్‌ను పెంచేందుకు ఎటువంటి చర్యలు చేపట్టాలనే అంశాలను కేంద్ర కమిటీ ఏపీ జెన్‌కో ఉన్నతాధికార్లకు ఆదేశాలు జారీ చేస్తుంది. ఈమేరకు జెన్‌కో ఉన్నతాధికారులు కేంద్ర కమిటీ సూచనలు, సలహాల మేరకు చర్యలు చేపడతారు. ఈ కార్యక్రమంలో సీలేరు కాంప్లెక్సు సూపరింటెండెంట్ ఇంజనీర్ జాకీర్ హూస్సేన్, ఏడీఈ జయపాల్, ఏఈఈ సురేష్ పాల్గొన్నారు.