ఐసీడీఎస్ పీడీగా డి.రాధామాధవి
ABN , Publish Date - Sep 11 , 2026 | 11:03 PM
మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్‌గా డి.రాధామాధవిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
బాపట్ల నుంచి అల్లూరి జిల్లాకి బదిలీ
పాడేరు, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్‌గా డి.రాధామాధవిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ ఐసీడీఎస్ పీడీగా పనిచేసిన సూర్యలక్ష్మి గతేడాది అనకాపల్లి జిల్లాకు బదిలీ కావడంతో ఇక్కడ పీడీ పోస్టు ఖాళీగా ఉంది. దీంతో జీకేవీధి సీడీపీవోగా పనిచేస్తున్న సీహెచ్.ఝాన్సీభాయికి స్థానిక ఐసీడీఎస్ పీడీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. తాజాగా బాపట్ల జిల్లాలో ఐసీడీఎస్ పీడీగా పనిచేస్తున్న డి.రాధామాధవిని అల్లూరి జిల్లాలో ఐసీడీఎస్ పీడీగా బదిలీ చేశారు. దీంతో ఆమె మంగళవారం ఇక్కడ ఐసీడీఎస్ పీడీగా బాధ్యతలు స్వీకరించనున్నారు.