Share News

బుక్‌ చేసిన 72 గంటల్లో సిలిండర్‌ డెలివరీ

ABN , Publish Date - Mar 14 , 2026 | 12:50 AM

వినియోగదారులు రీఫిల్‌ బుక్‌ చేసిన 72 గంటల్లో గ్యాస్‌ సిలిండర్‌ డెలివరీ చేయాలని, ఈ మేరకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని అయ్యేలా చర్యలు తీసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ శౌర్యమాన్‌ పటేల్‌ స్పష్టం చేశారు. శుక్రవారం ఉదయం తన చాంబర్‌లో తహశీల్దార్లు, ఎల్‌పీజీ డీలర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో గ్యాస్‌ సిలిండర్ల పంపిణీ, నిల్వలు, ధర విషయంలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

బుక్‌ చేసిన 72 గంటల్లో సిలిండర్‌ డెలివరీ
సమావేశంలో జేసీ శౌర్యమాన్‌పటేల్‌, పౌరసరఫరాల అధికారులు

ఒక్క రూపాయి కూడా అదనంగా తీసుకోవద్దు

ఓటీపీ లేకుండా సిలిండర్లను డెలివరీ చేయకండి

డీలర్లు అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు

జేసీ శౌర్యమాన్‌ పటేల్‌

అనకాపల్లి కలెక్టరేట్‌, మార్చి 13 (ఆంధ్రజ్యోతి) :

వినియోగదారులు రీఫిల్‌ బుక్‌ చేసిన 72 గంటల్లో గ్యాస్‌ సిలిండర్‌ డెలివరీ చేయాలని, ఈ మేరకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని అయ్యేలా చర్యలు తీసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ శౌర్యమాన్‌ పటేల్‌ స్పష్టం చేశారు. శుక్రవారం ఉదయం తన చాంబర్‌లో తహశీల్దార్లు, ఎల్‌పీజీ డీలర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో గ్యాస్‌ సిలిండర్ల పంపిణీ, నిల్వలు, ధర విషయంలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్యాస్‌ సిలిండర్ల పంపిణీ, స్టాక్‌ వివరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. గ్యాస్‌ కొరత ఏర్పడుతుందేమోనని వినియోగదారులు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. ఆయా గ్యాస్‌ ఏజెన్సీల వద్ద సేల్స్‌ ఆఫీసర్‌, స్థానిక తహశీల్దార్ల ఫోన్ల నంబర్లను ప్రజలకు అందుబాటులో వుంచాలని ఆయన ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన ధర కన్నా ఒక్క రూపాయి ఎక్కువ వసూలు చేసినా కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఓటీపీ లేకుండా గ్యాస్‌ సిలిండర్లను డెలివరీ చేయొద్దని స్పష్టం చేశారు. గృహవినియోగ గ్యాస్‌ సిలిండర్లను వేరే అవసరాలకు మళ్లించడం, అక్రమంగా నిల్వ చేయడం వంటి వాటికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. నిబంధనలను అతిక్రమిస్తే లైసెన్సును రద్దు చేయడానికి కూడా వెనుకాడబోమని జాయింట్‌ కలెక్టర్‌ హెచ్చరించారు. ఈ సమావేశంలో డీఎస్‌వో కేవీఎల్‌ఎన్‌ మూర్తి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Mar 14 , 2026 | 12:50 AM