Share News

సీలేరు చేరిన సైకిల్‌ యాత్ర

ABN , Publish Date - Jul 26 , 2026 | 11:11 PM

విజయవాడ నుంచి పూరి క్షేత్రానికి సైకిల్‌పై బయలు దేరిన విజయవాడకు చెందిన పాతగుంట శివ ఆదివారం సీలేరు చేరుకుని స్థానిక మారెమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు.

సీలేరు చేరిన సైకిల్‌ యాత్ర
సైకిల్‌ యాత్రికుడు పి.శివ

విజయవాడ నుంచి పూరి క్షేత్రానికి బయలుదేరిన యువకుడు

సీలేరు, జూలై 26 (ఆంధ్రజ్యోతి): విజయవాడ నుంచి పూరి క్షేత్రానికి సైకిల్‌పై బయలు దేరిన విజయవాడకు చెందిన పాతగుంట శివ ఆదివారం సీలేరు చేరుకుని స్థానిక మారెమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ తాను విజయవాడలో ఈ నెల 11న బయలుదేరి భద్రాచలం మీదుగా ఆదివారం ఉదయం సీలేరు చేరుకున్నానని తెలిపారు. ఇక్కడ నుంచి నర్సీపట్నం, విశాఖపట్నం మీదుగా ఒడిశాలోని పూరి పుణ్యక్షేత్రానికి వెళతానని చెప్పాడు.

Updated Date - Jul 26 , 2026 | 11:11 PM