తిరుగు ప్రయాణాలతో రద్దీ
ABN , Publish Date - Jan 18 , 2026 | 11:59 PM
సంక్రాంతి సెలవులు ముగియడంతో తిరుగు ప్రయాణాలతో ఆదివారం అనకాపల్లిలోని రైల్వే స్టేషన్, ఆర్టీసీ కాంప్లెక్స్ కిటకిటలాడాయి.
కిటకిటలాడిన ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్
అనకాపల్లి టౌన్, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి సెలవులు ముగియడంతో తిరుగు ప్రయాణాలతో ఆదివారం అనకాపల్లిలోని రైల్వే స్టేషన్, ఆర్టీసీ కాంప్లెక్స్ కిటకిటలాడాయి. ఉదయం నుంచి ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి తరలివచ్చారు. దూర ప్రాంతాల్లో ఉద్యోగ, వ్యాపారాలతో పాటు వివిధ విద్యాసంస్థల్లో విద్యాభ్యాసం, కార్మికులు తిరిగి జిల్లా నుంచి వారి స్థానాలకు చేరుకునేందుకు ప్రయాణమయ్యారు. అలాగే దూర ప్రాంతాలకు వెళ్లిన జిల్లా వాసులు తిరిగి స్వగ్రామానికి చేరుకోవడానికి కాంప్లెక్స్‌కు చేరుకోవడంతో బస్సులు రద్దీగా మారాయి. అయితే పలు బస్సులు సమయానికి రాకపోవడంతో ఎక్కువ సేపు నిరీక్షించాల్సి వచ్చింది. కాగా రైల్వేశాఖ ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని అనకాపల్లి నుంచి వికారాబాద్, అనకాపల్లి నుంచి చెర్లపల్లికి ప్రత్యేక రైలును ఆదివారం నడిపింది. నూతనంగా ప్రవేశపెట్టిన హౌరా - బెంగళూరు అమృతభారత్ రైలుకు కూడా ఈ సందర్భంగా అనకాపల్లి రైల్వేస్టేషన్‌లో హాల్ట్ కల్పించారు.