Share News

పర్యాటకుల సందడి

ABN , Publish Date - Jan 12 , 2026 | 10:41 PM

మండలంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతంగా పేరుగాంచిన సుంకరమెట్ట ఉడెన్‌ బ్రిడ్జిని తిలకించేందుకు సోమవారం అధిక సంఖ్యలో పర్యాటకులు వచ్చారు.

పర్యాటకుల సందడి
సుంకరమెట్ట ఉడెన్‌ బ్రిడ్జి వద్ద పర్యాటకులు

అరకులోయ, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతంగా పేరుగాంచిన సుంకరమెట్ట ఉడెన్‌ బ్రిడ్జిని తిలకించేందుకు సోమవారం అధిక సంఖ్యలో పర్యాటకులు వచ్చారు. సంక్రాంతి సెలవులు కావడంతో కుటుంబ సమేతంగా అరకులోయలోని పర్యాటక ప్రాంతాలను తిలకించిన అనంతరం ఇక్కడికి వచ్చారు. దీంతో ఈ ప్రాంతం సందడిగా కనిపించింది.

Updated Date - Jan 12 , 2026 | 10:41 PM