Share News

బందబయలు వాగులో మొసలి కలకలం

ABN , Publish Date - Nov 09 , 2026 | 11:18 PM

మండలంలోని లోతుగెడ్డ పంచాయతీ బందబయలు గ్రామంలో మొసలి కలకలం సృష్టించింది.

బందబయలు వాగులో మొసలి కలకలం
బందబయలు వాగు గట్టు వద్ద మొసలి

గట్టు వద్ద కనిపించడంతో భీతిల్లిన పశువుల కాపరులు

నిత్యం ఏడు గ్రామాల ప్రజలు వాగు దాటి రాకపోకలు

అటవీ శాఖ అధికారులు స్పందించాలని వేడుకోలు

చింతపల్లి, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): మండలంలోని లోతుగెడ్డ పంచాయతీ బందబయలు గ్రామంలో మొసలి కలకలం సృష్టించింది. సోమవారం బందబయలు వాగు వద్దకు పశువులకు నీళ్లు పెట్టేందుకు వెళ్లిన పశువులకాపరులకు గట్టుపై విశ్రాంతి తీసుకుంటున్న మొసలి కనిపించింది. దీంతో పశువుల కాపరులు పశువులను వాగు వద్దకు వెళ్లకుండా నిలువరించారు. కొంత సమయానికి మొసలి వాగు లోపలికి వెళ్లిపోయింది. కాగా ఏడు గ్రామాల ప్రజలు నిత్యం ఈ వాగు దాటి రాకపోకలు సాగిస్తుంటారు. అలాగే పశువులను నీళ్ల కోసం కాపరులు సాయంత్రం వేళల్లో తీసుకువెళతారు. మహిళలు దుస్తులు ఉతికేందుకు వస్తుంటారు. ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు స్పందించి మొసలిని గుర్తించి ఇతర ప్రాంతాలకు తరలించేందుకు చొరవ తీసుకోవాలని స్థానిక గిరిజనులు కోరుతున్నారు.

Updated Date - Nov 09 , 2026 | 11:18 PM