క్రికెట్ సమరం
ABN , Publish Date - Jan 28 , 2026 | 01:16 AM
భారత్, న్యూజిలాండ్ మధ్య బుధవారం జరగనున్న టీ20 మ్యాచ్‌కు నగరంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో నాగపూర్, రాయ్‌పూర్, గువహటిల్లో జరిగిన మూడు మ్యాచ్‌లలో విజయం సాధించిన టీమిండియా...ఇక్కడ జరగనున్న నాలుగో వన్డేలో కూడా విజయం సాధించి, జైత్రయాత్రను కొనసాగించాలని భావిస్తోంది.
నేడు భారత్, న్యూజిలాండ్ మధ్య టీ20
సిద్ధమైన ఏసీఏ-వీడీసీఏ స్టేడియం
అందరి దృష్టి అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్,
సూర్యకుమార్ యాదవ్ పైనే
సిరీస్ క్లీన్ స్వీప్‌పై భారత్ దృష్టి
ఇండియా జైత్రయాత్రను అడ్డుకునే యత్నంలో న్యూజిలాండ్
విశాఖపట్నం-స్పోర్ట్స్, జనవరి 27 (ఆంధ్రజ్యోతి):
భారత్, న్యూజిలాండ్ మధ్య బుధవారం జరగనున్న టీ20 మ్యాచ్‌కు నగరంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో నాగపూర్, రాయ్‌పూర్, గువహటిల్లో జరిగిన మూడు మ్యాచ్‌లలో విజయం సాధించిన టీమిండియా...ఇక్కడ జరగనున్న నాలుగో వన్డేలో కూడా విజయం సాధించి, జైత్రయాత్రను కొనసాగించాలని భావిస్తోంది. మరోవైపు ఇప్పటికే 3-0తో సిరీస్‌ను కోల్పోయినా చివరి రెండు మ్యాచ్‌లలోనైనా గెలుపొందాలనే లక్ష్యంతో న్యూజిలాండ్ బరిలోకి దిగుతోంది. టీమిండియాలో భీకర ఫామ్‌లో ఉన్న అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్‌తోపాటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా ప్రేక్షకులను కనువిందు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక, న్యూజిలాండ్ జట్టును పరిశీలిస్తే బ్యాటింగ్‌లో రాణిస్తున్న కెప్టెన్ శాంట్నర్ బౌలింగ్‌లో ప్రభావం చూపలేకపోతున్నాడు. మంచి ఫామ్‌లో ఉన్న ఫిలిప్స్‌కు మిచెల్, చాప్‌మన్, రచిన్ నుంచి ఆశించిన సహకారం అందడం లేదు. కాగా, స్టేడియంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
సీటు నంబరు విధానం
ఈ మ్యాచ్‌కు సీటు నంబరింగ్ విధానం అమలు చేస్తున్నారు. ప్రేక్షకులు టికెట్ మీద ఉన్న నంబరు ప్రకారం తమకు కేటాయించిన సీటులో కూర్చుని మ్యాచ్‌ను వీక్షించాలి. గత డిసెంబరు 6న భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌కు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ మాదిరిగా సీటు నంబరు విధానం అమలు చేయకపోవడంతో వాగ్వాదాలు, ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో నిర్వాహకులు సీటు నంబరు విధానాన్ని తిరిగి అమలు చేస్తున్నారు.
ఇరుజట్ల సాధన
ఇరు జట్లు శుక్రవారం ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో సాధన చేశారు. న్యూజిలాండ్ ఆటగాళ్లు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాధన చేయగా, భారత్ ఆటగాళ్లు సాయంత్రం నెట్ ప్రాక్టీస్ చేశారు.