నంబరు ప్లేట్ లేని వాహనాలపై ఉక్కుపాదం
ABN , Publish Date - Nov 23 , 2026 | 12:43 AM
పట్టణంలో నంబరు ప్లేట్‌లు లేని వాహనాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఆదివారం పట్టణ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. చైన్‌స్నాచింగ్ వంటి నేరాలకు పాల్పడే అసాంఘిక శక్తులు తప్పుడు నంబరు ప్లేట్‌లు వినియోగించడాన్ని కట్టడి చేయడంతో పాటు విరిగిపోయిన, అస్పష్టంగా ఉన్న వాహనాల నంబరు ప్లేట్‌ల వాడకాన్ని నియంత్రించడమే ఈ తనిఖీ ప్రధాన ఉద్దేశమని పోలీసులు చెబుతున్నారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీ చేసి నిబంధనలకు విరుద్ధంగా నంబరు ప్లేట్‌లు అమర్చిన వాహనదారులకు జరిమానాలు విధించారు.
- పోలీసుల ముమ్మర తనిఖీలు
అనకాపల్లి టౌన్, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో నంబరు ప్లేట్‌లు లేని వాహనాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఆదివారం పట్టణ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. చైన్‌స్నాచింగ్ వంటి నేరాలకు పాల్పడే అసాంఘిక శక్తులు తప్పుడు నంబరు ప్లేట్‌లు వినియోగించడాన్ని కట్టడి చేయడంతో పాటు విరిగిపోయిన, అస్పష్టంగా ఉన్న వాహనాల నంబరు ప్లేట్‌ల వాడకాన్ని నియంత్రించడమే ఈ తనిఖీ ప్రధాన ఉద్దేశమని పోలీసులు చెబుతున్నారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీ చేసి నిబంధనలకు విరుద్ధంగా నంబరు ప్లేట్‌లు అమర్చిన వాహనదారులకు జరిమానాలు విధించారు. అక్కడికక్కడే వాహనాలకు సరైన నంబరు ప్లేట్‌లు అమర్చేలా చర్యలు తీసుకున్నారు. వాహనదారులకు మోటార్ వాహన చట్టం నిబంధనలు, రహదారి భద్రత, ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు. ఈ తనిఖీల్లో పట్టణ సీఐ జి.ప్రేమ్‌కుమార్, ట్రాఫిక్ సీఐ నాగేశ్వరరావు, ఎస్‌ఐలు షేక్ జిలానీ, జి.శేఖరం, సిబ్బంది పాల్గొన్నారు.