గంజాయి రవాణాపై ఉక్కుపాదం
ABN , Publish Date - Jun 11 , 2026 | 12:15 AM
గంజాయి రవాణాపై పోలీసు శాఖ ఉక్కుపాదం మోపుతుందని ఎస్‌పీ అమిత్‌బర్దార్ తెలిపారు.
ఎస్‌పీ అమిత్‌బర్దార్ వెల్లడి
పోలీసులపై దాడి చేసి పరారైన నలుగురి కోసం ముమ్మరంగా గాలింపు
పాడేరు, జూన్ 10(ఆంధ్రజ్యోతి): గంజాయి రవాణాపై పోలీసు శాఖ ఉక్కుపాదం మోపుతుందని ఎస్‌పీ అమిత్‌బర్దార్ తెలిపారు. చింతపల్లి మండలం అన్నవరం పోలీసు స్టేషన్ పరిధిలో రామారావుపాలెం కూడలి వద్ద గంజాయి ముఠా పోలీసులపై దాడికి పాల్పడడం, ఈ నేపథ్యంలో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి నేపథ్యంలో బుధవారం ఇక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గంజాయి ముఠా సభ్యుల్లో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారని, మరో నలుగురు పరారయ్యారన్నారు. వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నామని, త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. జిల్లాలో గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపామన్నారు. గంజాయి సాగు, రవాణాపై గట్టి నిఘా పెట్టామని, ఇటువంటి చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడిన వారిని వదిలిపెట్టేది లేదని ఎస్‌పీ హెచ్చరించారు. ఈ సమావేశంలో చింతపల్లి ఏఎస్‌పీ నవజ్యోతిమిశ్రా పాల్గొన్నారు.