సీపీఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా కమిటీ ఏకగ్రీవం
ABN , Publish Date - Feb 04 , 2026 | 11:21 PM
ఆంధ్రప్రదేశ్ సీపీఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా కమిటీని బుధవారం స్థానిక గిరిజన ఉద్యోగుల భవన్‌లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అధ్యక్ష,కార్యదర్శులుగా మోరి మోహన్‌బాబు, ఎస్.వెంకటరమణ
పాడేరు, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ సీపీఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా కమిటీని బుధవారం స్థానిక గిరిజన ఉద్యోగుల భవన్‌లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా కమిటీ అధ్యక్షుడిగా మోరి మోహన్‌బాబు, ప్రధాన కార్యదర్శిగా సాగెని వెంకటరమణ, కోశాధికారిగా చప్పలి యువరాజ్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా జి.సింహాచలం, అసోసియేట్ ప్రెసిడెంట్‌గా పి.రాంబాబు, ఉపాఽధ్యక్షుడిగా పి.లింగన్న, కార్యదర్శిగా పి.సింహాచలం, సంయుక్త కార్యదర్శిగా ఒ.వాసుదేవ్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా జి.రాజుబాబు, కార్యవర్గసభ్యులుగా బి.భాస్కరరావు, పి.ఆనంద్, ఎస్.హరిబాబు, జి.శ్యామ్‌సుందర్, డి.సింహాచలం, ఎస్.హరిబాబు, కె.ఆనందబాబు, కె.రామ్‌లు ఎన్నికయ్యారు. జిల్లా కమిటీకి గౌరవ అధ్యక్షుడిగా కొండపల్లి రాంబాబు, సలహాదారులుగా మాసాడ ఈశ్వరరావు, ఎస్.కోటిబాబు, సి.సతీశ్, డి.ధనుంజయ్, ఎస్.పరమేశ్వరరావులు వ్యవహరిస్తున్నారు. జిల్లాలో సీపీఎస్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నూతన కమిటీ ఈ సందర్భంగా పేర్కొంది.