Share News

బూసుకొండలో కార్డెన్‌ సెర్చ్‌.

ABN , Publish Date - Mar 20 , 2026 | 11:31 PM

జీకేవీధి మండలం దుప్పులవాడ పంచాయతీ బూసుకొండ గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు కార్డెన్‌ సెర్చ్‌ చేపట్టారు.

బూసుకొండలో కార్డెన్‌ సెర్చ్‌.
బూసుకొండలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు

ప్రతీ ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించిన చేసిన పోలీసులు

గంజాయి జోలికి వెళ్లరాదని సీఐ హెచ్చరిక

సీలేరు, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): జీకేవీధి మండలం దుప్పులవాడ పంచాయతీ బూసుకొండ గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు కార్డెన్‌ సెర్చ్‌ చేపట్టారు. ఈ సందర్భంగా ప్రతీ ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. జీకేవీధి సీఐ సుధాకర్‌ ఆధ్వర్యంలో ఏపీఎస్‌పీ పోలీసులు ఆపరేషన్‌ వజ్రప్రహార్‌లో భాగంగా కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహించారు. గ్రామంలోని ద్విచక్ర వాహనాల రికార్డులను పరిశీలించారు. ఇంట్లో ఉన్న ప్రతీ ఒక్కరి వివరాలు సేకరించారు. అనంతరం గ్రామస్థులతో సీఐ సుధాకర్‌ సమావేశమయ్యారు. గంజాయి సాగు, రవాణాతో కలిగే అనర్ధాలపై వివరించారు. ఎవరూ వాటి జోలికి వెళ్లవద్దని హెచ్చరించారు. గ్రామానికి కొత్తగా అనుమానిత వ్యక్తులు వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని గ్రామస్థులకు సీఐ సుధాకర్‌ సూచించారు.

Updated Date - Mar 20 , 2026 | 11:31 PM