చింతపల్లి క్యాంప్‌లో కార్డెన్ సెర్చ్
ABN , Publish Date - Feb 25 , 2026 | 11:50 PM
జీకేవీధి మండలం సీలేరు పోలీస్ స్టేషన్ పరిధిలో గల చింతపల్లి క్యాంప్‌లో సీలేరు పోలీసులు, సీఆర్‌పీఎఫ్ జవాన్లు బుధవారం ఉదయం ఆరు గంటలకు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు.
ప్రతీ ఇంటిని తనిఖీ చేసిన పోలీసులు, సీఆర్‌పీఎఫ్ జవాన్లు
నాలుగు ద్విచక్ర వాహనాలు సీజ్
సీలేరు, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): జీకేవీధి మండలం సీలేరు పోలీస్ స్టేషన్ పరిధిలో గల చింతపల్లి క్యాంప్‌లో సీలేరు పోలీసులు, సీఆర్‌పీఎఫ్ జవాన్లు బుధవారం ఉదయం ఆరు గంటలకు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. గ్రామంలో ప్రతీ ఇంటికి ఎస్‌ఐ యం.డీ.యాసీన్ సిబ్బందితో వెళ్లి తనిఖీలు చేశారు. అనుమానితులను ప్రశ్నించి వారి వ్యక్తిగత జీవితం నేరమయంగా ఉందా?, అని పరిశీలించి అనంతరం విడిచిపెట్టారు. నాలుగు ద్విచక్ర వాహనాలకు ఎటువంటి రికార్డులు లేకపోవడంతో వాటిని సీజ్ చేశారు. గంజాయి, నాటు సారా, ఇతర అక్రమ వ్యాపారాలు చేసినా చట్టపరంగా శిక్షిస్తామని హెచ్చరించారు. వాహనాలకు రికార్డులు, డ్రైవింగ్ లైసెన్సు తప్పనిసరిగా ఉండాలన్నారు. మైనర్లు వాహనాలు నడపరాదని, మైనర్లు వాహనాలు నడిపితే ఆ వాహన యాజమానిపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు, సంఘ విద్రోహ శక్తులు గ్రామంలోకి ప్రవేశిస్తే తమకు సమాచారం ఇవ్వాలని ఎస్‌ఐ యాసీన్ కోరారు. తెల్లవారుజామునే పోలీసులు రావడంతో ఏం జరిగిందోనని గ్రామస్థులు ఆందోళన చెందారు. సీలేరు పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇంత వరకు ఎప్పుడూ కార్డెన్ సెర్చ్ నిర్వహించలేదు.