Share News

వంట నూనె సలసల

ABN , Publish Date - Mar 14 , 2026 | 11:25 PM

పశ్చిమ ఆసియా దేశాల్లో యుద్ధం కారణంగా బహిరంగ మార్కెట్లో వంట నూనెల ధరల సలసల కాగుతున్నాయి.

వంట నూనె సలసల

అమాంతం పెరిగిన ధరలు

సన్‌ ఫ్లవర్‌ ఆయిల్‌ లీటరు రూ.175

వేరుశెనగ నూనె రూ.185లు, పామాయిల్‌ రూ.120

నర్సీపట్నం, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): పశ్చిమ ఆసియా దేశాల్లో యుద్ధం కారణంగా బహిరంగ మార్కెట్లో వంట నూనెల ధరల సలసల కాగుతున్నాయి. సన్‌ ఫ్లవర్‌ ఆయిల్‌ గత నెలతో పోల్చుకుంటే లీటరు ప్యాకెట్‌ దగ్గర రూ.15లు పెరిగింది. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని హోల్‌సేల్‌ వ్యాపారులు అంటున్నారు. వేరుశెనగ నూనె గత నెలతో పోల్చుకుంటే ప్యాకెట్‌ రూ.180 నుంచి రూ.185లకు పెరిగింది. హోల్‌సేల్‌ మార్కెట్లో పామాయిల్‌ ధర 109 నుంచి రూ.116లకు పెరిగింది. ఫ్రీడమ్‌ సన్‌ ఫ్లవర్‌ ఆయిల్‌ ధర రూ.167 నుంచి 170లకు పెరిగింది. రిటైల్‌ మార్కెట్లో చూసుకుంటే పామాయిల్‌ ప్యాకెట్‌ ధర రూ.110 నుంచి రూ.120లకు పెరిగింది. ఫ్రీడమ్‌ సన్‌ ఫ్లవర్‌ ఆయిల్‌ రూ.168 నుంచి రూ.175లకు పెరిగింది. అన్ని ఆయిల్‌ ప్యాకెట్లు మీద సరాసరి లీటరు దగ్గర రూ.10లు పెరుగుదల కనిపించింది. వంట నూనెల ధరల ప్రభావం చిరు వ్యాపారులు, హోటళ్లు, పేద, మధ్య తరగతి ప్రజల మీద అధికంగా ఉంటుంది.

Updated Date - Mar 14 , 2026 | 11:25 PM