కంట్రోల్ రూమ్ సేవలు సద్వినియోగం చేసుకోవాలి
ABN , Publish Date - Apr 19 , 2026 | 11:48 PM
విపత్కర పరిస్థితుల్లో సహాయానికి, సమస్యలను అధికారులకు తెలిపేందుకు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ టి.నిశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లా కలెక్టర్ టి.నిశాంతి
టోల్ ఫ్రీ నంబర్: 08935-293448
పాడేరు, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): విపత్కర పరిస్థితుల్లో సహాయానికి, సమస్యలను అధికారులకు తెలిపేందుకు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ టి.నిశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధానంగా ప్రజలు తమ సమస్యల తక్షణ పరిష్కారానికి ఈ కంట్రోల్ రూమ్ దోహదపడుతుందన్నారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. తమ సమస్యలను టోల్ ఫ్రీ నంబర్ 08935-293448కు కాల్ చేసి తెలపాలన్నారు. ఈ కంట్రోల్ రూమ్‌లో ప్రత్యేక శిక్షణ పొందిన సిబ్బందిని ఇన్‌చార్జిలుగా నియమించామని, సమస్యలపై సమాచారం స్వీకరించి వెంటనే సంబంధిత శాఖల జిల్లా అధికారులకు వివరాలను అందిస్తారన్నారు.