Share News

ఫార్మసీపై పెత్తనం!

ABN , Publish Date - Jul 20 , 2026 | 01:11 AM

కేజీహెచ్‌లోని అత్యంత కీలకమైన ఫార్మసీ విభాగంలో సిబ్బందిపై ఒత్తిడి పెరుగుతోంది. ప్రతిరోజూ సుమారు మూడు నుంచి నాలుగు వేల మంది రోగులకు మందులు అందించే ఈ విభాగంలో సిబ్బందిపై మరో జూనియర్‌ అసిస్టెంట్‌ రుబాబు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నా యి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఫార్మసీ సిబ్బందికి రోస్టర్‌ వేయడం నుంచి సిబ్బంది మార్పు వరకు ఈ సెక్షన్‌ తో సంబంధంలేని ఓ జూనియర్‌ అసిస్టెంట్‌ పెత్తనం చెలాయిస్తున్నాడని చెబుతున్నారు. దీనిపై ఆస్పత్రి ఉన్న తాధికారికి వివరించేందుకు ఫార్మసీ విభాగం సిబ్బంది వెళ్తే అక్కడే ఉన్న జూనియర్‌ అసిస్టెంట్‌ వారిపై ఇష్టారాజ్యంగా నోరుపారేసుకున్నట్టు సమాచారం.

ఫార్మసీపై పెత్తనం!
కేజీహెచ్‌లో ఫార్మసీ విభాగం

కేజీహెచ్‌లో జూనియర్‌ అసిస్టెంట్‌ నిర్వాకం

ఉన్నతాధికారి సమక్షంలోనే ఫార్మసీ సిబ్బందిపై దుర్భాషలు

రోస్టర్‌, మందుల రివ్యూపై చీఫ్‌ ఫార్మసీ ఆఫీసర్‌కు సమాచారం కరువు

విశాఖపట్నం, జూలై 19 (ఆంధ్రజ్యోతి):

కేజీహెచ్‌లోని అత్యంత కీలకమైన ఫార్మసీ విభాగంలో సిబ్బందిపై ఒత్తిడి పెరుగుతోంది. ప్రతిరోజూ సుమారు మూడు నుంచి నాలుగు వేల మంది రోగులకు మందులు అందించే ఈ విభాగంలో సిబ్బందిపై మరో జూనియర్‌ అసిస్టెంట్‌ రుబాబు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నా యి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఫార్మసీ సిబ్బందికి రోస్టర్‌ వేయడం నుంచి సిబ్బంది మార్పు వరకు ఈ సెక్షన్‌ తో సంబంధంలేని ఓ జూనియర్‌ అసిస్టెంట్‌ పెత్తనం చెలాయిస్తున్నాడని చెబుతున్నారు. దీనిపై ఆస్పత్రి ఉన్న తాధికారికి వివరించేందుకు ఫార్మసీ విభాగం సిబ్బంది వెళ్తే అక్కడే ఉన్న జూనియర్‌ అసిస్టెంట్‌ వారిపై ఇష్టారాజ్యంగా నోరుపారేసుకున్నట్టు సమాచారం.

కేజీహెచ్‌ ఫార్మసీ విభాగంలో గతంలో 18 మంది సిబ్బంది ఓపీ (మందులు ఇచ్చే కౌంటర్‌)లో పనిచేసే వారు. ఇటీవల అధికారులు ఆరుగురిని తగ్గించారు. దీని వల్ల రోగులకు మందులు ఇవ్వడంలో జాప్యం జరుగు తోందనే విషయాన్ని ఉన్నతాధికారులు దృష్టికి తీసు కెళ్లేందుకు సిబ్బంది ప్రయత్నించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న సదరు జూనియర్‌ అసిస్టెంట్‌ ఓపీలో పనే లేదని, ఎందుకు అదనపు సిబ్బంది అంటూ చిందులు తొక్కినట్టు తెలిసింది. ఫార్మసీ విభాగంలో సిబ్బంది రోస్టర్‌ గురించి, మందులపై రివ్యూ సమాచారాన్ని చీఫ్‌ ఫార్మసీ ఆఫీసర్‌కు తెలియనీయకుండా అడ్డుకుంటున్నారని చెబుతున్నారు.

సర్వం అతడే

ఈ జూనియర్‌ అసిస్టెంట్‌ సుదీర్ఘకాలంగా కేజీహెచ్‌లోనే పనిచేస్తున్నట్టు చెబుతున్నారు. తన సీటు కానప్పటికీ అనేక విభాగాల్లో చేతులు పెడతాడనే విమర్శలున్నాయి. పలుమార్లు సీనియర్‌ అసిస్టెంట్‌గా పదోన్నతి వచ్చినా వదులుకున్నాడని చెబుతున్నారు. అతని వ్యవహారశైలితో పడుతున్న ఇబ్బందులను ఫార్మసీ విభాగంలోని కొందరు సిబ్బంది సన్నిహితుల వద్ద ప్రస్తావించి వాపోవడం మినహా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారని తెలిసింది. అతడి వ్యవహారశైలిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందుతున్నా కనీసం పట్టించుకోవడం లేదంటున్నారు.

మందుల కొరత..

ఫార్మసీ విభాగంలో సుమారు వందకుపైగా రకాల మందులు సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌ నుంచి సరఫరా కావడం లేదని తెలుస్తోంది. దీనిపై ఫార్మసీ సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినా ప్రయోజనం కనిపించలేదంటున్నారు. వీటిలో అత్యంత కీలకమైన 20కు పైగా రకాల ముందులున్నాయని చెబుతున్నారు.

Updated Date - Jul 20 , 2026 | 01:11 AM