Share News

కొనసాగుతున్న ఎండలు

ABN , Publish Date - Sep 08 , 2026 | 11:41 PM

వాతావరణంలోని మార్పులతో మన్యంలో ఎండల ప్రభావం కొనసాగుతున్నది.

కొనసాగుతున్న ఎండలు

వేడి, ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి

ఏటా ఇదే సమయంలో చల్లని వాతావరణం

ఈ ఏడాది అందుకు భిన్నం

కొయ్యూరులో 37.2 డిగ్రీలు

పాడేరు, సెప్టెబరు 8(ఆంధ్రజ్యోతి): వాతావరణంలోని మార్పులతో మన్యంలో ఎండల ప్రభావం కొనసాగుతున్నది. దీంతో జిల్లాలో మంగళవారం తీవ్రంగా ఎండ కాసింది. వేడి, ఉక్కపోత సైతం అధికంగానే ఉండడంతో జనం అల్లాడిపోయారు. వాస్తవానికి ప్రతి ఏడాది ఈ సమయానికి వర్షాలు అధికంగా కురిసి చల్లని వాతావరణం నెలకొంటుంది. కాని ఈఏడాది వాతావరణం అందుకు భిన్నంగా మారింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు సైతం కొనసాగుతున్నాయి. దీంతో కొయ్యూరులో మంగళవారం 37.2 డిగ్రీల సెల్సియస్‌ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా పాడేరులో 34.7, జీకేవీధిలో 34.0, జి.మాడుగులలో 33.0, అరకులోయలో 32.7, చింతపల్లిలో 31.5, ముంచంగిపుట్టులో 28.5, పెదబయలులో 28.4, హుకుంపేటలో 27.6 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Updated Date - Sep 08 , 2026 | 11:41 PM