Share News

కొనసాగుతున్న చలి తీవ్రత

ABN , Publish Date - Jan 28 , 2026 | 12:37 AM

మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. దీంతో చలి ప్రభావం చూపుతోంది.

కొనసాగుతున్న చలి తీవ్రత
పాడేరులో మంగళవారం ఉదయం పొగమంచును చీల్చుకుంటూ వస్తున్న సూర్యుడు

జి.మాడుగుల, హుకుంపేటలో 7.3 డిగ్రీలు

పాడేరు, జనవరి 27(ఆంధ్రజ్యోతి): మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. దీంతో చలి ప్రభావం చూపుతోంది. మంగళవారం జి.మాడుగుల, హుకుంపేటలో 7.3, అరకులోయలో 7.8, చింతపల్లిలో 8.5, పెదబయలులో 8.6, ముంచంగిపుట్టులో 8.9, కొయ్యూరులో 11.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

వణుకుతున్న మన్యం వాసులు

ఏజెన్సీలో గత కొన్ని రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతుండడంతో ఏజెన్సీ వాసులు గజగజ వణుకుతున్నారు. ఉదయం పది గంటల వరకు దట్టంగా పొగమంచు కురవడం, మధ్యాహ్నం మాత్రమే మోస్తరుగా ఎండ కాస్తున్నది. దీంతో నిత్యం చలి తీవ్రత కొనసాగుతున్నది. జనం ఉన్ని దుస్తులు ధరించి, చలి మంటలు వేసుకుంటూ చలి నుంచి రక్షణ పొందుతున్నారు.

Updated Date - Jan 28 , 2026 | 12:37 AM