కొనసాగుతున్న చలి తీవ్రత
ABN , Publish Date - Jan 06 , 2026 | 11:27 PM
మన్యంలో చలి తీవ్రత కొనసాగుతోంది. పాడేరు మొదలుకుని ఏజెన్సీ వ్యాప్తంగా మంగళవారం ఉదయం ఎనిమిది గంటల వరకు పొగమంచు కురిసింది.
ముంచంగిపుట్టులో 8.0 డిగ్రీలు
పాడేరు, జనవరి 6(ఆంధ్రజ్యోతి): మన్యంలో చలి తీవ్రత కొనసాగుతోంది. పాడేరు మొదలుకుని ఏజెన్సీ వ్యాప్తంగా మంగళవారం ఉదయం ఎనిమిది గంటల వరకు పొగమంచు కురిసింది. ముంచంగిపుట్టులో 8.0 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా, పెదబయలులో 9.4, జి.మాడుగులలో 9.7, హుకుంపేటలో 11.1, చింతపల్లిలో 11.4, పాడేరులో 11.5, అరకులోయలో 12.0, కొయ్యూరులో 14.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
డుంబ్రిగుడలో...
డుంబ్రిగుడ: మండలంలో చలి తీవ్రత అధికంగా ఉంది. మంగళవారం ఉదయం 8 గంటల వరకు మంచు కురవడంతో వాహనదారులు లైట్ల వెలుతురులో రాకపోకలు సాగించారు. చలి కారణంగా రైతులు, వ్యవసాయ కూలీలు ఉదయం పొలాలకు వెళ్లడానికి ఇబ్బంది పడ్డారు. వీధుల్లో చలి మంటలు వేసుకుని ఉపశమనం పొందారు.