Share News

చోడవరం జడ్పీటీసీపై కూటమిలో పోటీ

ABN , Publish Date - Oct 24 , 2026 | 01:02 AM

స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి చోడవరం జడ్పీటీసీ స్థానాన్ని కూటమిలోని మూడు పార్టీల నేతలు తమకే కేటాయించాలని పట్టుబడుతున్నారు. టీడీపీ తరపున జడ్పీటీసీ మాజీ సభ్యుడు కనిశెట్టి మత్య్సరాజు, పల్లా అర్జున్‌ గురువారం నామినేషన్లు దాఖలు చేశారు.

చోడవరం జడ్పీటీసీపై   కూటమిలో పోటీ

టీడీపీతోపాటు జనసేన, బీజేపీల నుంచి నామినేషన్లు

ఎవరికి వారు తామే పోటీ చేస్తామని పట్టు

చోడవరం, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి చోడవరం జడ్పీటీసీ స్థానాన్ని కూటమిలోని మూడు పార్టీల నేతలు తమకే కేటాయించాలని పట్టుబడుతున్నారు. టీడీపీ తరపున జడ్పీటీసీ మాజీ సభ్యుడు కనిశెట్టి మత్య్సరాజు, పల్లా అర్జున్‌ గురువారం నామినేషన్లు దాఖలు చేశారు. వీరిద్దరి అభ్యర్థిత్వంపై అధిష్ఠానం ఇప్పటికే ఐవీఆర్‌ఎస్‌ ద్వారా అభిప్రాయ సేకరణ పూర్తి చేసింది. వీరిద్దరిలో ఒకరు బరిలో నిలవడం ఖాయమని అనుకుంటున్న సమయంలో, చోడవరం జడ్పీటీసీ స్థానం తమకు కావాలని బీజేపీ పట్టుబడుతున్నది. అంతేకాక ఆ పార్టీ నాయకుడు ఈర్లె శ్రీరామమూర్తి నామినేషన్‌ కూడా దాఖలు చేశారు. ఇదే సమయంలో కూటమిలో మరో పార్టీ అయిన జనసేన తరపున జెర్రిపోతుల నానాజీ కూడా నామినేషన్‌ దాఖలు చేశారు. దీంతో సీట్ల సర్దుబాటులో భాగంగా చోడవరం జడ్పీటీసీని ఏ పార్టీకి కేటాయిస్తారన్న దానిపై కేడర్‌లో సందిగ్ధం నెలకొంది.

Updated Date - Oct 24 , 2026 | 01:02 AM