జాతీయ క్రీడా పోటీల్లో విజేతలకు అభినందన
ABN , Publish Date - Apr 09 , 2026 | 11:54 PM
ఖేలో ఇండియా జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులు, ఉపాధ్యాయుడిని ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ పీవో తిరుమాని శ్రీపూజ గురువారం అభినందించారు.
పాడేరురూరల్, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): ఖేలో ఇండియా జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులు, ఉపాధ్యాయుడిని ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ పీవో తిరుమాని శ్రీపూజ గురువారం అభినందించారు. గత నెల 28వ తేదీ నుంచి ఈ నెల 4వ తేదీ వరకు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయపూర్‌లో జరిగిన ఖేలో ఇండియా జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో ఆర్చరీ క్రీడా విభాగంలో ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర పాఠశాల (తలారిసింగి) ఉపాధ్యాయుడు జి.బైరాగినాయుడు రజిత పతకం సాధించారు. అదే విధంగా 2025-25 విద్యా సంవత్సరంలో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల బాలబాలికలు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని అనేక పతకాలను సాధించారు. వీరిని గురువారం ఐటీడీఏ కార్యాలయంలో పీవో శ్రీపూజ, టీడబ్ల్యూ డీడీ పీవీబీ పరిమళ అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం టి.నాగేశ్వరరావు, స్పోర్ట్స్ కో-ఆర్డినేటర్ ఎస్.సింహాచలం, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.