Share News

శిథిలావస్థకు చేరడంతో ఎప్పుడు కూలుతుందోనని ఆందోళన

ABN , Publish Date - May 20 , 2026 | 12:20 AM

మూడు దశాబ్దాల క్రితం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన జీసీసీ బ్రాంచి కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరింది. శ్లాబ్‌ పెచ్చులు ఊడి, గోడలు బీటలు బారి, వర్షాలకు శ్లాబ్‌ లీకవుతూ ఏ క్షణాన కూలుతుందో తెలియని దుస్థితిలో ఉంది. ఈ భవనంలోనే గత దశాబ్ద కాలంగా భయాందోళనతోనే సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.

శిథిలావస్థకు చేరడంతో ఎప్పుడు కూలుతుందోనని ఆందోళన
శిథిలావస్థకు చేరిన జీసీసీ బ్రాంచి కార్యాలయం

- శిథిలావస్థకు చేరడంతో ఎప్పుడు కూలుతుందోనని ఆందోళన

- ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని విధులు నిర్వహిస్తున్న సిబ్బంది

- వర్షమొస్తే ఫైళ్లను భద్రపరచడానికి పాట్లు

కొయ్యూరు, మే 19 (ఆంధ్రజ్యోతి): మూడు దశాబ్దాల క్రితం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన జీసీసీ బ్రాంచి కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరింది. శ్లాబ్‌ పెచ్చులు ఊడి, గోడలు బీటలు బారి, వర్షాలకు శ్లాబ్‌ లీకవుతూ ఏ క్షణాన కూలుతుందో తెలియని దుస్థితిలో ఉంది. ఈ భవనంలోనే గత దశాబ్ద కాలంగా భయాందోళనతోనే సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.

జీసీసీ బ్రాంచి కార్యాలయ భవనాన్ని 1997లో నిర్మించారు. దీన్ని ఆనుకుని బ్రాంచి మేనేజర్‌ నివాస గృహాన్ని కూడా నిర్మించారు. అయితే బ్రాంచి మేనేజర్‌ నివాస గృహం ప్రారంభానికి నోచుకోకుండానే శిఽథిలం కాగా, కార్యాలయ భవనం నాటి నుంచి నేటి వరకు కనీస మరమ్మతులకు నోచకపోవడంతో శిథిలావస్థకు చేరింది. ప్రస్తుతం ఈ భవనం శ్లాబ్‌ పెచ్చులు ఊడి, గోడలు బీటలువారి చిన్నపాటి వర్షం కురిసినా కార్యాలయం మొత్తం తడిసి ముద్దవుతోంది. గత ప్రభుత్వంలో జీసీసీ చైర్మన్‌ మండల పర్యటనలో భాగంగా జీసీసీ బ్రాంచి కార్యాలయ దుస్థితిని చూసి వెంటనే భవన నిర్మాణానికి నిధులు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. అయితే నిధులు మాత్రం మంజూరు చేయలేదు. వర్షం కురిస్తే రికార్డులను భద్రపరుచుకోవడం సిబ్బందికి సవాల్‌గా మారింది. అలాగే ఏ క్షణాన కూలుతుందోననే భయంతోనే సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికైనా జీసీసీ చైర్మన్‌ ఈ భవన దుస్థితిని దృష్టిలో ఉంచుకుని నూతన భవన నిర్మాణానికి నిధులు కేటాయించాలని సిబ్బంది కోరుతున్నారు.

Updated Date - May 20 , 2026 | 12:20 AM