Share News

మెడికల్‌ కాలేజీలో సంపూర్ణ వసతులు

ABN , Publish Date - Aug 22 , 2026 | 11:13 PM

పాడేరు ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో సంపూర్ణంగా వసతులను కల్పించేందుకు చర్యలు చేపడతామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ వీరపాండ్యన్‌ అన్నారు.

మెడికల్‌ కాలేజీలో సంపూర్ణ వసతులు
మెడికల్‌ కాలేజీలో ప్రిన్సిపాల్‌ వెంకటేశ్వర్లుతో మాట్లాడుతున్న రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ వీరపాండ్యన్‌

రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ వీరపాండ్యన్‌

పాడేరు, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): పాడేరు ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో సంపూర్ణంగా వసతులను కల్పించేందుకు చర్యలు చేపడతామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ వీరపాండ్యన్‌ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీని ఆయన సందర్శించారు. ఈ సందర్భగా వీరపాండ్యన్‌ మాట్లాడుతూ.. మెడికల్‌ కాలేజీలో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వసతులు కల్పిస్తామన్నారు. వైద్య విద్యార్థులు ఈ ప్రాంతానికి సేవలందించాలన్నారు. మెడికల్‌ కాలేజీకి దూరంగా ఉన్న ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రినే బోధనాస్పత్రిగా ప్రభుత్వం వినియోగిస్తున్నారని, బోధనాస్పత్రిని మెడికల్‌ కాలేజీలోనే ఉండాలని బోధనా సిబ్బంది కోరారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి, అందుకు అవసరమైన చర్యలు చేపడతామన్నారు. మెడికల్‌ కాలేజీలో స్థితిగతులపై ప్రిన్సిపాల్‌ వెంకటేశ్వర్లును అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ టి.నిషాంతి, జాయింట్‌ కలెక్టర్‌ టి.శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి రియాజ్‌భేగ్‌, ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శ్రీనివాసరావు, సిబ్బంది పాల్టొన్నారు.

Updated Date - Aug 22 , 2026 | 11:13 PM