Share News

మోదకొండమ్మ ఉత్సవాలకు రండి

ABN , Publish Date - May 08 , 2026 | 12:30 AM

ఈ నెల 17, 18, 19 తేదీల్లో పాడేరులో జరిగే మోదకొండమ్మ ఉత్సవాలకు రావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఐటీ, మానవ వనరుల శాఖల మంత్రి నారా లోకేశ్‌ను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆహ్వానించారు.

మోదకొండమ్మ ఉత్సవాలకు రండి
మంత్రి నారా లోకేశ్‌కు మోదకొండమ్మ ఉత్సవాల ఆహ్వాన పత్రిక ఇస్తున్న మంత్రి సంధ్యారాణి, కలెక్టర్‌ నిషాంతి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి

సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి లోకేశ్‌కు ఆహ్వానం

పాడేరు, మే 7(ఆంధ్రజ్యోతి): ఈ నెల 17, 18, 19 తేదీల్లో పాడేరులో జరిగే మోదకొండమ్మ ఉత్సవాలకు రావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఐటీ, మానవ వనరుల శాఖల మంత్రి నారా లోకేశ్‌ను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆహ్వానించారు. అమరావతిలో గురువారం సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి లోకేశ్‌ను కలెక్టర్‌ నిషాంతి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరితో కలిసి ఉత్సవాల ఆహ్వాన పత్రికను ఆమె అందించారు. ఉత్సవాలకు ప్రభుత్వం సహకారం అందించాలని వారు కోరారు.

Updated Date - May 08 , 2026 | 12:30 AM