వార్డు సచివాలయాల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
ABN , Publish Date - Apr 07 , 2026 | 01:09 AM
జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ సోమవారం 98వ వార్డులోని 524, 523, 529 సచివాలయాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
సింహాచలం, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి):
జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ సోమవారం 98వ వార్డులోని 524, 523, 529 సచివాలయాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రికార్డుల నిర్వాహణ తీరుతెన్నులు, మూవ్‌మెంట్ రిజిస్టర్ నిర్వాహణను సమగ్రంగా పరిశీలించారు. ప్రభుత్వ పథకాలు పొందుతున్న లబ్ధిదారుల పేర్లను నోటీస్ బోర్డులో ప్రదర్శించాలని సిబ్బందిని ఆదేశించారు. సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు మరింత శ్రమించాలన్నారు. 524వ సచివాలయం నడుస్తున్న భవనం శిథిలావస్థకు చేరుకుందని, వినియోగదారులు కార్యాలయానికి దూరంగా ఉండడంతో సర్వేలు చేయడానికి కాస్త సమయం పడుతుందని సిబ్బంది ఈ సందర్భంగా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. సచివాలయ భవనానికి తక్షణం మరమ్మతులు చేయించాలని కోరారు. ఈ నేపథ్యంలో సచివాలయ కార్యాలయాన్ని లబ్ధిదారులకు అందుబాటులో ఉండేలా మార్చాలని కలెక్టర్ ఆదేశించారు.