Share News

4 నెలల్లో కాఫీ పొడి ఉత్పత్తి

ABN , Publish Date - Oct 09 , 2026 | 12:36 AM

మండలంలోని శెట్టిపాలెం పరిధిలో గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న కాఫీ పొడి ప్రాసెసింగ్‌ యూనిట్‌ శంకుస్థాపన ఏర్పాట్ల పనులను గురువారం సంస్థ ఎండీ ఎస్‌ఎస్‌ శోభిక పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కాఫీ పొడి ప్రాసెసింగ్‌ యూనిట్‌ నిర్మాణానికి ఈనెల 13వ తేదీన శాసనసభ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నట్టు చెప్పారు.

4 నెలల్లో కాఫీ పొడి ఉత్పత్తి
కాఫీ పొడి ప్రాసెసింగ్‌ యూనిట్‌ శంకుస్థాపన ఏర్పాట్లను జీసీసీ ఎండీ శోభికకు వివరిస్తున్న అధికారులు

రెండు దశల్లో 700 మంది మహిళలకు ఉపాధిఇ

జీసీసీ ఎండీ శోభిక వెల్లడి

శెట్టిపాలెంలో కాఫీ యూనిట్‌ శంకుస్థాపన ఏర్పాట్లు పరిశీలన

మాకవరపాలెం, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): మండలంలోని శెట్టిపాలెం పరిధిలో గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న కాఫీ పొడి ప్రాసెసింగ్‌ యూనిట్‌ శంకుస్థాపన ఏర్పాట్ల పనులను గురువారం సంస్థ ఎండీ ఎస్‌ఎస్‌ శోభిక పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కాఫీ పొడి ప్రాసెసింగ్‌ యూనిట్‌ నిర్మాణానికి ఈనెల 13వ తేదీన శాసనసభ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నట్టు చెప్పారు. సుమారు రూ.10 కోట్లతో నిర్మించనున్న ఈ యూనిట్‌లో నాలుగు నెలల్లో ఉత్పత్తి ప్రారంభం అవుతుందని తెలిపారు. రాష్ట్రంలో జీసీసీ ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి కాఫీ యూనిట్‌ ఇదేనని చెప్పారు. ఇక్కడి నుంచి దేశవిదేశాలకు కాఫీ పౌడర్‌ ఎగుమతి అవుతుందన్నారు. కాఫీ పొడి ప్రాసెసింగ్‌ యూనిట్‌లో మొదటి దశలో 400 మంది మహిళలు, రెండో దశలో మరో 300 మంది మహిళలకు ఉపాధి లభిస్తుందని ఆమె వెల్లడించారు. శంకుస్థాపన ఏర్పాట్లపై ఎస్‌ఈ కేవీఎస్‌ఎన్‌ కుమార్‌కు పలు సూచనలు చేశారు. జీసీసీ ఎండీ వెంట నర్సీపట్నం ఆర్‌డీవో వి.వి.రమణ, తహశీల్దార్‌ నూకరాజు, జీసీసీ ఈఈ వేణుగోపాల్‌, జీఎం దేవరాజ్‌, ఏఈ రఘురామ్‌, టీడీపీ నేతలు అల్లు రామునాయుడు, ఆర్‌వై పాత్రుడు, నందకిశోర్‌, చిరంజీవిరాజు, తదితరులు వున్నారు.

Updated Date - Oct 09 , 2026 | 12:37 AM