Share News

కాఫీ బెర్రీ బోరర్‌ కీటకంపై అప్రమత్తం

ABN , Publish Date - Mar 22 , 2026 | 12:27 AM

వాతావరణంలో కలిగిన మార్పులతో కాఫీ తోటల్లో బెర్రీ బోరర్‌ కీటకం ఉధృతి పెరిగే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్‌ డాక్టర్‌ ఆళ్ల అప్పలస్వామి అన్నారు. శనివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ వెచ్చని, మితమైన తేమతో కూడిన వాతావరణ పరిస్థితులు గిరిజన ప్రాంతంలో ఉండడం వల్ల కాఫీ బెర్రీ బోరర్‌ వ్యాప్తి చెందుతుందన్నారు.

కాఫీ బెర్రీ బోరర్‌ కీటకంపై అప్రమత్తం
విలేకరులతో మాట్లాడుతున్న ఏడీఆర్‌ డాక్టర్‌ ఆళ్ల అప్పలస్వామి

రైతులకు ఏడీఆర్‌ అప్పలస్వామి సూచన

వాతావరణం మార్పులతో ఉధృతయ్యే అవకాశం

చింతపల్లి, మార్చి 21 (ఆంధ్రజ్యోతి):

వాతావరణంలో కలిగిన మార్పులతో కాఫీ తోటల్లో బెర్రీ బోరర్‌ కీటకం ఉధృతి పెరిగే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్‌ డాక్టర్‌ ఆళ్ల అప్పలస్వామి అన్నారు. శనివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ వెచ్చని, మితమైన తేమతో కూడిన వాతావరణ పరిస్థితులు గిరిజన ప్రాంతంలో ఉండడం వల్ల కాఫీ బెర్రీ బోరర్‌ వ్యాప్తి చెందుతుందన్నారు. ఈ కీటకం గుర్తిస్తే ఇథనాల్‌-మిథనాల్‌ ఉచ్చులను హెక్టారుకి 1:1 పద్ధతిలో 25 ఏర్పాటు చేసుకోవాలన్నారు. బెర్రీ బోరర్‌ తీవ్రత అధికంగా ఉంటే స్పినోసాడ్‌ 0.3మిల్లీమీటర్లు గాని, ఎమామెక్టిన్‌ బెంజోయేట్‌ 5శాతం ఎస్‌జీ 0.4గ్రాములు లీటరు నీటిలో కలుపుకుని పిచికారీ చేసుకోవాలన్నారు. వర్షానికి ముందుగాని, తరువాత గాని పిచికారీ చేయరాదన్నారు. అలాగే పసుపు, అల్లం పంటల్లో కాండం తొలిచే పురుగు, తామర పురుగు ఉధృతి పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ తెగులు నియంత్రణకు ఫెరోమోన్‌ ట్రాఫ్‌లు ఎకరాకు ఐదు చొప్పున ఏర్పాటు చేసుకోవాలన్నారు. పురుగులు ఆశించినట్టు గమనిస్తే లీటరు నీటిలో క్లోరాంట్రానిలిప్రోల్‌ 18.5ఎస్‌సీ 0.3మిల్లీ లీటర్లు కలుపుకుని పిచికారీ చేసుకోవాలన్నారు.

Updated Date - Mar 22 , 2026 | 12:27 AM