సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన
ABN , Publish Date - Apr 19 , 2026 | 01:10 AM
మండలంలోని గజిరెడ్డిపాలెం వద్ద ఏర్పాటు కానున్న రెన్యూ సోలార్ పరిశ్రమకు ఈ నెల 23న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ఏర్పాట్లను కలెక్టర్ విజయకృష్ణన్, ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్, అధికారులు శనివారం పరిశీలించారు. అనంతరం అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
రాంబిల్లి, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గజిరెడ్డిపాలెం వద్ద ఏర్పాటు కానున్న రెన్యూ సోలార్ పరిశ్రమకు ఈ నెల 23న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ఏర్పాట్లను కలెక్టర్ విజయకృష్ణన్, ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్, అధికారులు శనివారం పరిశీలించారు. అనంతరం అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భద్రత ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలన్నారు. ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ మాట్లాడుతూ సీఎం పర్యటనను విజయవంతం చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంగా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ తుహిన్‌సిన్హా, జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్‌పటేల్, ఆర్డీవో వీవీ రమణ, స్థానిక తహశీల్దార్ సత్యనారాయణ, ఎంపీడీవో జయమాధవి, పలు శాఖల అధికారులు, కూటమి నాయకులు పప్పల నూకన్నదొర, వి.దిన్‌బాబు, తదితరులు పాల్గొన్నారు.