Share News

29న సీఎం అరకు పర్యటన?

ABN , Publish Date - Aug 20 , 2026 | 12:20 AM

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 29న అరకులోయలో పర్యటిస్తారని విశ్వసనీయంగా తెలిసింది. అరకులోయ మండలం గన్నెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంజీవని పైలట్‌ ప్రాజెక్టును ఆయన లాంఛనంగా ప్రారంభిస్తారని తెలుస్తున్నది.

29న సీఎం అరకు పర్యటన?

గన్నెల పీహెచ్‌సీలో సంజీవని పైలట్‌ ప్రాజెక్టును ప్రారంభించే అవకాశం

పాడేరు, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 29న అరకులోయలో పర్యటిస్తారని విశ్వసనీయంగా తెలిసింది. అరకులోయ మండలం గన్నెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంజీవని పైలట్‌ ప్రాజెక్టును ఆయన లాంఛనంగా ప్రారంభిస్తారని తెలుస్తున్నది. వాస్తవానికి ఈ నెల 22న సీఎం గన్నెల పీహెచ్‌సీలో సంజీవని ప్రాజెక్టును ప్రారంభించాల్సిన ఉండగా, ఏర్పాట్లు, ఇతర డేటా నమోదు ప్రక్రియ పూర్తికాకపోవడంతో సీఎం పర్యటన వాయిదా పడింది. దీంతో ఈ నెల 29న సీఎం అరకులోయ వచ్చి గన్నెల పీహెచ్‌సీలో సంజీవని ప్రాజెక్టును ప్రారంభిస్తారని అధికారులు భావిస్తున్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లను పీహెచ్‌సీ పరిధిలో చేపడుతున్నారు. అయితే కలెక్టర్‌ టి.నిషాంతి, జేసీ శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ సీఎం పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నప్పటికీ తేదీ మాత్రం ఖరారు కాలేదని పేర్కొంటున్నారు.

Updated Date - Aug 20 , 2026 | 12:20 AM