22న సీఎం చంద్రబాబు రాక
ABN , Publish Date - Aug 19 , 2026 | 12:25 AM
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 22వ తేదీన మాడుగుల నియోజకవర్గంలో నిర్వహించే ‘స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమానికి హాజరుకానున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
మాడుగుల నియోజకవర్గంలో స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమం
టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు
అనకాపల్లి, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 22వ తేదీన మాడుగుల నియోజకవర్గంలో నిర్వహించే ‘స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమానికి హాజరుకానున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నియోజకవర్గంలోని దేవరాపల్లి లేదా కె.కోటపాడు మండలాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం వుందన్నారు. పూర్తి వివరాలు ఒకటి, రెండు రోజుల్లో అధికారులు వెల్లడిస్తారన్నారు. ‘స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం నిర్వహించే గ్రామంలో సీఎం చంద్రబాబునాయుడు ప్రజలతో మమేకం అవుతారని, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతోపాటు పరిశుభ్రత, పచ్చదనం ఆవశ్యకత గురించి ప్రజలకు దిశానిర్దేశం చేస్తారన్నారు. అనంతరం టీడీపీ మాడుగుల నియోజకవర్గం నాయకులు, ముఖ్యకార్యకర్తలతో నిర్వహించే ఆత్మీయ సమావేశంలో మాట్లాడతారని పేర్కొన్నారు.