Share News

సీఎం చంద్రబాబు 23న రాక

ABN , Publish Date - Apr 17 , 2026 | 12:47 AM

అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల్లో విస్తరించిన ప్రత్యేక ఆర్థిక మండలిలో మరో భారీ పరిశ్రమ ఏర్పాటు కానున్నది. రాంబిల్లి మండల పరిధిలోని జడ్‌.చింతువ పంచాయతీ పరిధిలో 136 ఎకరాల్లో సుమారు నాలుగు వేల కోట్ల రూపాయల పెట్టుబడితో నిర్మించనున్న ‘రెన్యూ ఫొటోవోల్టాయిక్స్‌’ ప్లాంట్‌కు (సోలార్‌ సెల్స్‌, మాడ్యూల్స్‌ తయారీ) ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 23వ తేదీన శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్లాంట్‌లో సోలార్‌ విడిభాగాలను ఉత్పత్తి చేస్తారు.

సీఎం చంద్రబాబు 23న రాక
ముఖ్యమంత్రి చంద్రబాబు సభ నిర్వహణ కోసం చేపట్టిన షెడ్ల నిర్మాణం

ఎస్‌ఈజడ్‌లో ‘రెన్యూ ఫొటోవోల్టాయిక్స్‌’ ప్లాంట్‌కు శంకుస్థాపన

రూ.4 వేల కోట్ల పెట్టుబడులు

రెండేళ్లలో ఉత్పత్తి ప్రారంభం

సీఎం పర్యటనకు శరవేగంగా ఏర్పాట్లు

రాంబిల్లి, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల్లో విస్తరించిన ప్రత్యేక ఆర్థిక మండలిలో మరో భారీ పరిశ్రమ ఏర్పాటు కానున్నది. రాంబిల్లి మండల పరిధిలోని జడ్‌.చింతువ పంచాయతీ పరిధిలో 136 ఎకరాల్లో సుమారు నాలుగు వేల కోట్ల రూపాయల పెట్టుబడితో నిర్మించనున్న ‘రెన్యూ ఫొటోవోల్టాయిక్స్‌’ ప్లాంట్‌కు (సోలార్‌ సెల్స్‌, మాడ్యూల్స్‌ తయారీ) ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 23వ తేదీన శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్లాంట్‌లో సోలార్‌ విడిభాగాలను ఉత్పత్తి చేస్తారు. సోలార్‌ విద్యుదుత్పత్తి రంగానికి ఊతం ఇవ్వడంతోపాటు స్థానిక యువతకు ఉపాఽది కల్పించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. 2028 మార్చినాటికి నిర్మాణం పూర్తిచేసుకొని ఉత్పత్తి ప్రారంభం అవుతుంది. ముఖ్యమంత్రి రాక నేపథ్యంలో ఏర్పాటు పనులు శరవేగంగా సాగుతున్నాయి. సభ నిర్వహణ కోసం భారీ షెడ్డును నిర్మిస్తున్నారు. ఈ ఏర్పాట్లను తహశీల్దారు పి.సత్యనారాయణ, ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ నరసింహారావు, డిప్యూటీ జోనల్‌ మేనేజర్‌ సూర్యనారాయణ, సీఐ నరసింగరావు పర్యవేక్షిస్తున్నారు.

Updated Date - Apr 17 , 2026 | 12:47 AM