Share News

ఆలయాల మూసివేత

ABN , Publish Date - Mar 03 , 2026 | 11:28 PM

చంద్రగ్రహణం కారణంగా జిల్లాలోని ప్రధాన ఆలయాలన్నీ మంగళవారం మూతపడ్డాయి.

ఆలయాల మూసివేత
చంద్రగ్రహణం కారణంగా మూసివేసిన పాడేరు మోదకొండమ్మ ఆలయం

చంద్రగ్రహణం ఎఫెక్ట్‌

సంప్రోక్షణ అనంతరం నేడు తెరుచుకోనున్న దేవాలయాలు

పాడేరు, మార్చి 3(ఆంధ్రజ్యోతి): చంద్రగ్రహణం కారణంగా జిల్లాలోని ప్రధాన ఆలయాలన్నీ మంగళవారం మూతపడ్డాయి. ప్రధానంగా స్థానిక మోదకొండమ్మ అమ్మవారు, ఉమానీలకంఠేశ్వర ఆలయం, సుండ్రుపుట్టులోని సాయిబాబా, శీతారామాలయం, ఆర్‌టీసీ కాంప్లెక్స్‌ వద్ద కనకదుర్గ, అయ్యప్ప ఆలయాలు, కొత్తపాడేరులో సాయిబాబా, అంజనేయస్వామి, కనకదుర్గాదేవి ఆలయాలు, పాతపాడేరులో పురాతన శివాలయం, అలాగే ఇతర ప్రాంతాల్లోని దేవాలయాలను మూసివేశారు. చంద్రగ్రహణం మంగళవారం మధ్యాహ్నం 3.20 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6.40 గంటలకు ముగిసింది. గ్రహణం అనంతరం సంప్రోక్షణ ప్రక్రియను నిర్వహించి, బుధవారం నుంచి యథావిధిగా ఆలయాలను తెరుస్తామని పలు ఆలయాల కమిటీలు ప్రకటించాయి.

Updated Date - Mar 03 , 2026 | 11:28 PM