అనంతగిరి ఘాట్ మార్గం మూసివేత
ABN , Publish Date - Oct 29 , 2026 | 12:33 AM
భారీ వర్షాలకు అనంతగిరిలో పలు చోట్ల ఘాట్ మార్గం ధ్వంసం కావడంతో తాత్కాలికంగా ఈ మార్గాన్ని మూసేస్తున్నామని ఎస్‌పీ అమిత్‌బర్దార్ తెలిపారు.
పాడేరు ఘాట్‌ను ప్రత్యామ్నాయంగా వినియోగించాలని ఎస్‌పీ సూచన
పాడేరు, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): భారీ వర్షాలకు అనంతగిరిలో పలు చోట్ల ఘాట్ మార్గం ధ్వంసం కావడంతో తాత్కాలికంగా ఈ మార్గాన్ని మూసేస్తున్నామని ఎస్‌పీ అమిత్‌బర్దార్ తెలిపారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో అనంతగిరి ఘాట్ మార్గంలో వాహనాల రాకపోకలు ప్రమాదకరమని, ఈ తరుణంలో పాడేరు ఘాట్ మార్గాన్ని ప్రత్యామ్నాయంగా వినియోగించుకోవాలని ఆయన సూచించారు. జిల్లాలో జి.మాడుగుల మండలం మత్స్యపురం ప్రాంతంలో గత నెలలో కురిసిన వర్షాలకు రోడ్డు దెబ్బతిని మూడు రోజుల పాటు రాకపోకలు నిలిచిపోయాయి. తాజా వర్షాల నేపథ్యంలో ఆయా ప్రాంతాలను ఎస్‌పీ అమిత్‌బర్దార్ బుధవారం సందర్శించి రోడ్డు మార్గాల స్థితిగతులను పరిశీలించారు. అలాగే తాజా భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా, సురక్షితంగా ఉండాలన్నారు. పోలీసుల నుంచి ఎటువంటి సహాయం కావాలన్నా అత్యవసర నంబర్: 112, కంట్రోల్ రూమ్ నంబర్: 9281442977కు ఫోన్ చేయాలని సూచించారు.