భారీ వాహనాలకు క్లీనర్లు తప్పనిసరి
ABN , Publish Date - Mar 05 , 2026 | 01:15 AM
జాతీయ రహదారులపై భారీ వాహనాలు (లారీలు) క్లీనర్లు లేకుండానే పరుగులు తీస్తున్నాయి. నగరంలో ఈ కారణంగా తరచూ ప్రమాదాలు జరిగి పాదచారులు, ద్విచక్ర వాహన చోదకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ తరహా ప్రమాదాలన్నీ పారిశ్రామిక ప్రాంతమైన గాజువాక పరిసరాల్లోనే ఎక్కువ జరుగుతున్నాయి. దీంతో తాజాగా ఆర్‌టీఏ అధికారులు లారీలకు తప్పనిసరిగా క్లీనర్ ఉండాల్సిందేనని స్పష్టం చేస్తూ ప్రకటన జారీచేశారు. దీనిని గాజువాక పోలీసులు అమలు చేస్తున్నారు. ఎంతవరకు ప్రమాదాలు కట్టడి అవుతాయనేది వేచి చూడాల్సి ఉంది.
ఆర్టీఏ ఆదేశాలు
జాతీయ రహదారిపై ప్రమాదాల నియంత్రణకు చర్యలు
గాజువాక పరిధిలో పోలీసుల ప్రత్యేక ఉత్తర్వులు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
జాతీయ రహదారులపై భారీ వాహనాలు (లారీలు) క్లీనర్లు లేకుండానే పరుగులు తీస్తున్నాయి. నగరంలో ఈ కారణంగా తరచూ ప్రమాదాలు జరిగి పాదచారులు, ద్విచక్ర వాహన చోదకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ తరహా ప్రమాదాలన్నీ పారిశ్రామిక ప్రాంతమైన గాజువాక పరిసరాల్లోనే ఎక్కువ జరుగుతున్నాయి. దీంతో తాజాగా ఆర్‌టీఏ అధికారులు లారీలకు తప్పనిసరిగా క్లీనర్ ఉండాల్సిందేనని స్పష్టం చేస్తూ ప్రకటన జారీచేశారు. దీనిని గాజువాక పోలీసులు అమలు చేస్తున్నారు. ఎంతవరకు ప్రమాదాలు కట్టడి అవుతాయనేది వేచి చూడాల్సి ఉంది.
ఎవరూ రావడం లేదు
గతంలో ప్రతి లారీకి తప్పనిసరిగా క్లీనర్ లేదా హెల్పర్ ఉండేవారు. డ్రైవర్‌కు చేదోడువాదోడుగా ఉండేవారు. వాహనాలను కీలక మార్గాల్లో నడిపేటప్పుడు క్లీనర్ డోర్ దగ్గర నిలబడి వెనుక వైపు చూస్తూ డ్రైవర్‌కు తగిన సూచనలు చేసేవారు. ఎటువంటి ప్రమాదం జరగకుండా సాయంగా ఉండేవారు. ఇప్పుడు ఈ విధానం 90 శాతం అమలులో లేదు. డ్రైవర్లు రియర్ వ్యూ మిర్రర్‌లో చూస్తూ వాహనాలు నడుపుతున్నారు. ఇది ప్రమాదాలకు దారితీస్తోంది.
ప్రత్యేక సూచనలు
గాజువాక పోలీసులు ప్రమాదాల నివారణకు ప్రత్యేక సూచనలు చేశారు.
- రహదారులపై స్టాపర్లను రాత్రిపూట తొలగించాలి. వీటివల్ల ప్రమాదం జరిగితే దానికి ఆ జోన్ అధికారులదే బాధ్యత.
- ఆటోలు, ద్విచక్ర వాహనాలు తప్పనిసరిగా సర్వీస్ రహదారిలోనే వెళ్లాలి. మెయిన్ రోడ్డుపైకి రాకూడదు.
- ఆర్టీసీ బస్సులు, భారీ వాహనాలు మెయిన్‌రోడ్డులోనే ప్రయాణించాలి. సర్వీస్ మార్గంలోకి వెళ్లకూడదు.
- బ్రేక్ డౌన్ వాహనాలను రాత్రిపూట రోడ్లపై ఉంచకూడదు. తప్పనిసరిగా తొలగించాలి.