Share News

ఉక్కిరిబిక్కిరి..

ABN , Publish Date - May 17 , 2026 | 10:25 PM

మన్యంలో ఎండలు తీవ్రత తగ్గడం లేదు. దీంతో ఏజెన్సీ వాసులు ఎండ ప్రతాపానికి విలవిలలాడుతున్నారు.

ఉక్కిరిబిక్కిరి..

తగ్గని ఎండలు

ఉక్కపోతతతో విలవిలలాడిన జనం

పాడేరులో 37.9 డిగ్రీలు

పాడేరు, ఏప్రిల్‌ 17(ఆంధ్రజ్యోతి): మన్యంలో ఎండలు తీవ్రత తగ్గడం లేదు. దీంతో ఏజెన్సీ వాసులు ఎండ ప్రతాపానికి విలవిలలాడుతున్నారు. ఆదివారం ఉదయం నుంచే ఎండ తీవ్రంగా కాసింది. ఎండ వేడిమికి ఉక్కపోత తోడవడంతో జనం ఉక్కిరిబిక్కిరయ్యారు. దీంతో చెట్లను ఆశ్రయించారు. మధ్యాహ్నం వేళలో జనం బయట తిరగలేని పరిస్థితి నెలకొంది. గతకొన్ని రోజులుగా రాత్రి పగలు తేడా లేకుండా ఉక్కపోత కొనసాగుతున్నది. ఏజెన్సీలో ఆదివారం పాడేరు, జీకేవీధి, డుంబ్రిగుడ. జి.మాడుగులలో 37.9 డిగ్రీల సెల్సియస్‌ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదుకాగా కొయ్యూరులో 36.9, అరకులోయలో 34.4, చింతపల్లిలో 33.5, పెదబయలు, అనంతగిరిలో 33.0, హుకుంపేటలో 32.6, ముంచంగిపుట్టులో 32.4 డిగ్రీల సెల్సియస్‌గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Updated Date - May 18 , 2026 | 08:00 AM